Sara Ali Khan : అమృతా సింగ్ కు కూతురు సారా అలీఖాన్ బర్త్ డే విషేస్.. తల్లిని పోలిన ఫొటోలను షేర్ చేసిన ‘సారా’

Published : Feb 09, 2022, 04:51 PM ISTUpdated : Feb 09, 2022, 04:55 PM IST

బాలీవుడ్ సీనియర్ నటి అమృతా సింగ్ ఈ రోజు 64వ పుట్టిన రోజును  జరుపుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో కూతురు, నటి సారా అలీ ఖాన్ తల్లిని ప్రతిబింబించే తన ఫొటోలను జతచేసి విషేస్ తెలిపింది.    

PREV
17
Sara Ali Khan : అమృతా సింగ్ కు కూతురు సారా అలీఖాన్ బర్త్ డే విషేస్.. తల్లిని పోలిన ఫొటోలను  షేర్ చేసిన ‘సారా’

మర్ద్, టూస్టేట్స్, సూర్య వంశీ, నామ్ వంటి సినిమాల్లో నటించి బాలీవుడ్ సీనియర్ నటి అమృతా సింగ్ తనకంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని పొందారు. 1983 నుంచి మొన్నటి ఫ్లైయింగ్ జెట్ వరకు తన అభిమానులను సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తూ ఉన్నారు. 
 

27

ఆర్మీ ఆఫీసర్ పంజాబీ జెట్ సిఖ్, రుఖ్సానా సుల్తానాకు 1 958 ఫిబ్రవరి 9న జన్మించారు అమృతా సింగ్. 40 ఏండ్ల కిందనే తన కేరీర్ ను ప్రారంభించిన అమృతా సింగ్ 1991 బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan)ను పెళ్లిచేసుకుంది. అనంతరం 2004లో 13 ఏండ్ల తరువాత వీరిద్దరూ డివోర్స్ తీసుకున్నారు. 
 

37

 ఆ తర్వాత ఎవరి జీవితంలో వారూ మూవ్ అన్ అయ్యారు. ఏదో సినిమాలో కనిపిస్తూ ప్రేక్షకును మాత్రం అలరిస్తూనే ఉన్నారు. కాగా, నేడు అమృతా సింగ్ 64వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.అభిమానులు, బంధువులు నుంచి పెద్ద ఎత్తున్న విషేస్ అందాయి. ఈ క్రమంలో కూతురు సారా అలీ ఖాన్ కూడా ప్రత్యేకంగా తన తల్లికి విషేస్ తెలియజేసింది. తన తల్లి మీద ప్రేమను కూడా సోషల్ మీడియాలో వివరించింది. 

47

బాలీవుడ్ చిత్రం  'కూలీ నంబర్ 1' నటి తన తల్లి అమృతా సింగ్  కార్బన్ కాపీయే తను అంటూ సారా అలీఖాన్ తల్లీ-కూతుళ్ల ద్వయం చిత్రాలను అభిమానులతో పంచుకుంది. అచ్చు తల్లిని పోలి ఉన్న ఉన్న ఫొటోలను చూసిన నెటిజన్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

57

 పుట్టినరోజు సందర్భంగా ఒక నోట్ కూడా రాసిందీ సారా.  “జన్మదిన శుభాకాంక్షలు అమ్మ, నేను ఎల్లప్పుడూ అద్దంలో నీ ప్రతిబింబాన్ని చూపిస్తున్నాను. నన్ను ప్రేరేపిస్తూ, నన్ను ప్రోత్సహిస్తూ, నాకు స్ఫూర్తినిస్తున్నందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని సంతోషపెట్టడానికి, గర్వపడేలా చేయడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తానని వాగ్దానం చేస్తున్నాను’ అంటూ పేర్కొంది. 

67

 సారా అలీ ఖాన్ 2004లో విడిపోయిన సైఫ్ అలీ ఖాన్ మరియు అమృతా సింగ్‌ల కుమార్తె  సారా బాలీవుడ్‌లో అభిషేక్ కపూర్ తెరకెక్కించిన 'కేదార్‌నాథ్'లో  దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి నటించారు. ఆ తర్వాత అనేక మంది ఏ-జాబితా తారలతో కలిసి పనిచేస్తున్నారు.  

77

 గతంలో ఓ ఈ-టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా మాట్లాడుతూ తన తల్లి అమృతా సింగ్‌తో తన రిలేషన్ గురించి చెప్పింది.  "మా అమ్మ సహకారంతో నా బ్యాంగిల్స్‌ను నా దుస్తులకు సరిపోల్చకుండా నేను ఇంటర్వ్యూకి కూడా రాలేను’ అంటూ తెలిపింది. దీంతో సారా అలీఖాన్ కు తల్లి మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చంటూ పలువురు మవుతోంది.

click me!

Recommended Stories