తిరుపతి లడ్డూ వివాదం: పవన్ కు కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్

First Published | Sep 21, 2024, 7:04 AM IST

తిరుపతి లడ్డు నాణ్యత వివాదంపై పవన్ కల్యాణ్   వ్యాఖ్యలకు నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) కౌంటర్ ఇస్తున్నట్లుగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

prakash raj

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.  వైఎస్సార్సీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించిన నివేదికలను టీడీపీ నేతలు బయటపెట్టారు.

నివేదికల్లో పొందుపర్చిన అంశాలను ప్రస్తావిస్తూ, జగన్​పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి  విడుదల చేశారు.   ఈ నేపధ్యంలో పెద్ద వివాదం నెలకొంది. 

Prakash Raj

 
 ఈ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేయగా.. ఆ వ్యాఖ్యలకు నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) కౌంటర్ ఇస్తున్నట్లుగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Latest Videos


Pawan kalyan

  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ విషయానికి వస్తే.. ‘‘తిరుపతి బాలాజీ పవిత్ర ప్రసాదాన్ని కల్తీ చేయడం ఆలయ కమిటీ చేసిన ద్రోహం మరియు అతి పెద్ద పాపం. ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకుని నిందితులను అరెస్ట్ చేయండి.

ఈ విషయంలో హిందువులు తీవ్రంగా హర్టయ్యారు’’ అంటూ హిందూ ఐటీ విభాగం నుండి వచ్చిన ట్వీట్‌కు..‘‘తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు‌ను వినియోగించడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. 

Prakash

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.

ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయస్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసి నిర్మూలించాలి’’ అని పవన్ కళ్యాణ్ స్పందించారు. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

పవన్ కళ్యాణ్ ట్వీట్‌కు నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటరేస్తూ.. ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌లో.. ‘‘డియర్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం లడ్డూ వివాదం జరుగుతున్న రాష్ట్రంలోనే మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దయచేసి విచారణ జరపండి.

ఈ విషయంలో తప్పు చేసింది ఎవరో కనిపెట్టి వారిని కఠినంగా శిక్షించండి. అంతేకానీ, మీరు ప్రజలలో భయాందోళనలను పెంచి, దీన్నో జాతీయ స్థాయి సమస్యగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే మనదేశంలో మతపరమైన ఉద్రిక్తతలు చాలానే ఉన్నాయి (కేంద్రంలో ఉన్న మీ మిత్రులకు ధన్యవాదాలు)’’ అని పేర్కొన్నారు. 

Prakash Raj , Pawan Kalyan, Tirupati laddu controversy


గతంలోనూ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై ప్రకాష్ రాజ్ కామెంట్స్ చేసారు. జనసేన అధినేత పూటకు ఓ మాట మారుస్తున్నారని, ఆయన ఓ ఊసరవెల్లి అని ప్రకాష్ రాజ్ కామెంట్ చేశారు.

బీజేపీ పార్టీకి ఓటు వేయాలని తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు సూచించడాన్ని ప్రకాష్ రాజ్ తప్పుపట్టారు. ప్రతి ఎన్నికల్లో వేరే పార్టీలకు మద్దతు తెలిపే నేతవి అయితే రాజకీయాలు అవసరమా అని పవన్ కళ్యాణ్‌ను ఆయన ప్రశ్నించారు..

Prakash Raj

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలతో నిరుత్సాహం చెందానని, ఆయన వ్యవహారం తనకు అర్థం కావడం లేదన్నారు. ఓ పార్టీ అధినేతగా ఉండి, వేరే పార్టీలకు మద్దతు తెలపడంపై పవన్ కళ్యాణ్‌ను ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.

మీ పార్టీ విధి విధానాలు ఏంటి, జనసేన పార్టీ ఓటింగ్ షేర్ ఎంత ఉందో తెలుసుకోవాలని పవన్‌కు సూచించారు.   జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  బీజేపీకి తెలుపుతున్నాడని, ఎన్నిసార్లు తన వైఖరి మార్చుకుంటారని.. ఊసరవెల్లిలా మారిపోయారని వ్యాఖ్యానించారు.
 

click me!