అర్జున్ కపూర్ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ రిలేషన్ షిప్ పై స్పందిస్తూ రిలేషన్ షిప్ లో వయస్సును చూడటం, సంబంధాన్ని సందర్భోచితంగా ఎత్తి చూపడం ఒక వెర్రి ఆలోచనగా భావిస్తున్నట్టు తెలిపారు. ఎంత ట్రోల్స్ చేసినా, ఎన్ని కామెంట్లు చేసినా మలైకా, అర్జున్ ప్రేమ విషయంలో వయస్సు కేవలం సంఖ్య మాత్రమే. అది కూడా నిరూపితమైందని పేర్కొన్నారు.