‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై నాని ‘టక్ జగదీశ్’ ఓటీటీ రిలేజ్ ఎఫెక్ట్... ఏకంగా ఆరు నెలల పాటు...

First Published Aug 19, 2021, 7:52 AM IST

నాచురల్ స్టార్ నాని నటించిన ‘టక్ జగదీశ్’ ఓటీటీలో నేరుగా విడుదల కావడం దాదాపు ఖరారైపోయింది. ఇన్నాళ్లు ‘టక్ జగదీశ్’ సినిమా థియేటర్‌లో వస్తుందా, ఓటీటీలో విడుదల అవుతుందా? అనే విషయంలో సందేహాలు ఉన్నా... తాజాగా నాని చేసిన పోస్టుతో ఆ అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి. 

‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసిన శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న మూడో సినిమా కావడంతో ‘టక్ జగదీశ్‌’పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి...

ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పాటు నాని పోస్టర్ లుక్ కారణంగా ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 23న థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది...

వినాయక చవితికి నాని సినిమా థియేటర్లలో సందడి చేయడం ఖాయం... అనుకుంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల రేటు విషయంలో రేగిన గందరగోళం... నిర్మాతలను ఆలోచనల్లో పడేసింది. 

రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా కోసం దాదాపు రూ.25 కోట్ల వరకూ ఖర్చు చేశారు నిర్మాతలు. అనుకున్న సమయానికి విడుదల కాకపోవడంతో వడ్డీతో కలిపి ఇది కాస్తా రూ.30 కోట్ల రూపాయలు దాటింది...

ఇప్పుడున్న సమయంలో సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా, తెలంగాణ, ఓవర్‌సీస్ ఏరియాల్లో కలెక్షన్ల వర్షం కురిసినా... వారం రోజుల్లో ఈ మొత్తాన్ని వెనక్కి రాబట్టడం కష్టమే... ఆంధ్రలో టికెట్ల రేట్లు పెంచుకుండా అమ్మితే... ఇందులో పావువంతు కూడా రాదు...

కరోనా మొదటి వేవ్ తర్వాత విడుదలైన సినిమాలకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘ఉప్పెన’, ‘జార్జీ రెడ్డి’, ‘జాతి రత్నాలు’, ‘నాంది’, ‘మాస్టర్’, ‘క్రాక్’, ‘వకీల్ సాబ్’ వంటి సినిమాలు సూపర్ హిట్ కలెక్షన్లను సాధించాయి...

అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన ‘తిమ్మరసు’, ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ వంటి సినిమాలు.. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, ఆశించిన రేంజ్‌లో కలెక్షన్లను సాధించలేకపోయాయి... దీనికి కారణం ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయమే...

ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచకూడదని తీసుకున్న నిర్ణయం, ‘వకీల్ సాబ్’ను తీవ్రంగా దెబ్బతీసింది. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చినా, అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చినా... బ్రేక్ ఈవెన్‌ పాయింట్‌ను చేరుకోలేకపోయింది పవన్ సినిమా...

ఇప్పుడు ‘టక్ జగదీశ్’ కూడా ఈ అనుభవాల కారణంగానే నేరుగా ఓటీటీలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. నాని సినిమా కోసం దాదాపు రూ.37 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది అమేజాన్ ప్రైమ్. అంటే సినిమా ఎలా ఉన్నా నిర్మాతలు సేఫ్ అయినట్టే...

నాని సినిమా ‘టక్ జగదీశ్’ ఎఫెక్ట్... ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ వంటి సినిమాలపై పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఏదీ ఏమైనా ‘ఆర్ఆర్ఆర్’ను అక్టోబర్‌లో రిలీజ్ చేయాలని భావించాడు ఎస్‌ఎస్ రాజమౌళి...

అయితే ఇప్పుడు ఏపీలో టికెట్ రేట్ల ఇష్యూ కారణంగా ఈ టైమ్‌లో రిలీజ్ చేస్తే... ఎంత లేదన్నా లాంగ్‌రన్‌లో రూ.20 నుంచి రూ.30 కోట్ల వరకూ నష్టపోవాల్సి ఉంటుంది. దీంతో ఈ గొడవ పూర్తి సమసిపోయానే సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట ‘ఆర్ఆరఆర’ యూనిట్...

అక్టోబర్ 13న తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడతో పాటు ప్రపంచభాషల్లో విడుదల అవుతున్న ‘ఆర్ఆర్ఆర్’... సంక్రాంతికి వస్తుందని టాక్ వినబడింది. అయితే ఇప్పటికే సంక్రాంతి స్లాట్‌ను మహేష్ ‘సర్కారువారి పాట’, వెంకీ ‘ఎఫ్ 3’, పవన్- రానా ‘భీమ్లా నాయక్’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఫిక్స్ చేసుకున్నాయి...

అదీకాకుండా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా కూడా సంక్రాంతికే వస్తుందనే టాక్ వినబడుతోంది. ఒకవేళ అన్నయ్య ‘ఆచార్య’ సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయితే... తమ్ముడు ‘భీమ్లా నాయక్’ రిపబ్లిక్ డేకి వాయిదా పడొచ్చని టాక్ వినబడుతోంది...

జనవరిలో ఖాళీలు లేకపోవడంతో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’... మార్చిలో విడుదల చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారట చిత్రయూనిట్... 

ఈ రెండు సినిమాలతో పాటు క్రిస్టమస్‌కి వస్తానని ప్రకటించిన ‘పుష్ఫ’ సినిమాపై కూడా ఈ ఎఫెక్ట్ తీవ్రంగా పడే అవకాశం ఉంది... ఈ గ్యాప్‌లో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో సెకండ్ వేవ్ తర్వాత విడుదలయ్యే భారీ బడ్జెట్ సినిమా ‘పుష్ఫ’నే అవుతుంది...

‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడితే, బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియకుండా, నేరుగా ‘పుష్ఫ’ని థియేటర్లలో దించే ప్రయత్నం చేయకపోవచ్చు. అదీకాకుండా అదే రోజున విడుదలయ్యే ‘కేజీఎఫ్ 2’తో అల్లుఅర్జున్ పోటీ పడాల్సి ఉంటుంది...

‘కేజీఎఫ్ 2’ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్‌లో విడుదలవుతుంది. ‘కేజీఎఫ్’ పార్ట్ 1కి ఇక్కడ భారీ కలెక్షన్లు వచ్చాయి. ఎలా చూసినా యష్‌తో పోటీపడడం, కరెక్ట్ కాదని బన్నీ భావించవచ్చని అంటున్నారు సినీ పండితులు.. 

click me!