Krrish 4: హృతిక్ రోషన్ సినిమాకి ఆర్దిక ఇబ్బందులు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Published : Feb 05, 2025, 07:23 AM IST

Krrish 4:  హృతిక్ రోషన్   'క్రిష్ 4' సినిమా బడ్జెట్ కష్టాలను ఎదుర్కొంటోందని వార్తలు వస్తున్నాయి. దర్శకుడు రాకేశ్ రోషన్ ఈ వార్తలను ఖండించారు, కానీ బడ్జెట్ సమస్యలను ఒప్పుకున్నారు.

PREV
13
Krrish 4: హృతిక్ రోషన్ సినిమాకి ఆర్దిక ఇబ్బందులు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్


కొన్ని విషయాలు ఆశ్చర్యం అనిపిస్తాయి. నిజమేనా అని  సందేహపడేలా చేస్తాయి. ఇప్పుడు హృతిక్ రోషన్ సినిమాకు బడ్జెట్ కష్టాలు అనే వార్త అంతటా ట్రెండ్ అవుతోంది. మామూలుగా సినిమాలకు బడ్జెట్ కష్టాలు అనేది పెద్ద వార్త, విషయం కాదు

కానీ హృతిక్ రోషన్ వంటి స్టార్ కు ఈ పరిస్దితి ఏమిటి అంటున్నారు. అయితే బాలీవుడ్ కష్టాల్లో ఉండటం, గత కొంతకాలంగా సినిమాలు ఆడకపోవటమే అందుకు కారణం అయ్యిండవచ్చు అంటున్నారు. ఇంతకీ హృతిక్ రోషన్ సినిమా ఎంత బడ్జెట్ అనుకున్నారు...ఏం జరిగిందో చూద్దాం
 

23
Image: Rakesh Roshan/Instagram


హృతిక్ రోషన్   క్రిష్‌ 4  సినిమాపై వస్తున్న వార్తలపై ఆ చిత్ర దర్శకుడు రాకేశ్‌ రోషన్‌ ఎట్టకేలకు నోరు విప్పారు.  ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ చిత్రాన్ని 12 ఏళ్ల నుంచి తెరకెక్కించలేకపోతున్నట్లు చెప్పారు.ఆ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ‘క్రిష్‌ 4’ చిత్రం ఆగిపోలేదు.. బడ్జెట్‌ గురించే ఆలోచిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. ఇండియా సూపర్‌ హీరో కాన్సె‌ప్ట్ తో హృతిక్‌ రోషన్‌ హీరోగా ‘క్రిష్‌’ చిత్రం ఇప్పటివరకూ మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నాలుగో భాగం నిర్మాణానికి వచ్చే సరికి కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఇటీవలి కాలంలో ప్రేక్షకుల అంచనాలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. కనుక ఆ స్థాయిలోనే ఖర్చు పెట్టి సినిమా తీస్తే తప్ప వారిని ఆకట్టుకోవడం కష్టమవుతోంది అన్నారు. ఇక క్రిష్‌ సిరీస్‌ చిత్రాలు వరుసగా 2003, 2006, 2013 సంవత్సరాల్లో విడుదలైన విషయం తెలిసిందే.

33
Krrish 4


రాకేష్ రోషన్ మాట్లాడుతూ.... ‘‘క్రిష్‌ 4’ (Krrish 4) కోసం ప్రేక్షకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ, మేము ఎంత ప్రయత్నించినా బడ్జెట్‌ సమకూరడం లేదు. అందుకే ఇది ఆలస్యమవుతోంది. నాలుగో భాగాన్ని మరింత గ్రాండ్‌గా తీయాలి. ఒకవేళ నేను బడ్జెట్‌ తగ్గించాలని చూస్తే.. ఈ చిత్రం ఓ సాధారణ కథలా అయిపోతుంది. అంతేకాదు.. ప్రస్తుతం ప్రపంచం చాలా చిన్నదిగా మారిపోయింది. అరచేతిలో ఉండే సెల్‌ఫోన్‌లో మొత్తం తెలిసిపోతోంది.

ఈ రోజుల్లో పిల్లలు కూడా ఎంతోమంది సూపర్‌హీరోల చిత్రాలను చూస్తున్నారు. అలాంటప్పుడు మనం చిన్న తప్పు చేసినా వారి నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే మరింత జాగ్రత్తగా దీన్ని తీయాలి. హాలీవుడ్‌లో సూపర్‌ హీరో డ్రామాలు భారీ బడ్జెట్‌తో రూపొందిస్తారు. అది మనకు సాధ్యం కాదు. అంత ఖర్చులు భరించలేం. వారు రూ.1000తో సినిమా తీస్తే.. మనం అదే సినిమాను రూ.4కు తీయాలి. నిర్మాతలు బడ్జెట్‌పై కాకుండా మంచి కథలపై దృష్టి పెట్టాలి’’ అని దర్శకుడు రాకేష్‌ రోషన్‌ చెప్పారు. 
  

Read more Photos on
click me!

Recommended Stories