#Kalki ఫేక్ కలెక్షన్స్ వేసిన ఆ క్రిటిక్స్ పై 25 కోట్లు పరువు నష్టం దావా?

Published : Jul 19, 2024, 06:53 AM IST

 'కల్కి' సినిమా కలెక్షన్ల  అసలు నిజం ఏమిటి? అంటూ కొందరు డిస్కషన్స్ మొదలెట్టారు. అయితేఇందులో ఎక్కువ శాతం బాలీవుడ్ నుంచే ఉంది. 

PREV
112
   #Kalki ఫేక్ కలెక్షన్స్ వేసిన ఆ క్రిటిక్స్ పై 25 కోట్లు పరువు నష్టం దావా?
Kalki 2898 AD

ప్రభాస్‌ నుంచి  ఏ సినిమాకీ రానంత హైప్‌ ‘కల్కి 2898ఏడీ’కి వచ్చింది. అదే స్దాయిలో సినిమా భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కుంభవృష్టి కురిపిస్తోంది. వర్గాలతో రెండు రోజులుగా కలెక్షన్స్ డ్రాప్ అయినా, 1200 కోట్లకు రీచ్ అవటానికి పరుగెడుతోంది. ఇక  దర్శకుడిగా నాగ్‌ అశ్విన్‌ చేసింది రెండు సినిమాలే అయినా.. రెండూ గొప్ప సినిమాలు కావడం, ప్రతిష్టాత్మక వైజయంతీమూవీస్‌ నుంచి వస్తున్న సినిమా కావడం, నాగ్‌అశ్విన్‌ ఎంచుకున్న కథ కావడం.. అన్నింటినీ మించి అమితాబ్‌, కమల్‌ లాంటి ఆలిండియా సూపర్‌స్టార్లు ఇందులో భాగం కావడం.. ఇవన్నీ ఈ సినిమా ఈ స్దాయి సక్సెస్ కి గల కారణాలు కావచ్చు. ఇక ఈ చిత్రం కలెక్షన్స్ ని అఫీషియల్ గా నిర్మాణ సంస్దే ప్రకటిస్తోంది. అయితే అదే సమయంలో ఈ కలెక్షన్స్ ఫేక్ అని ప్రచారం మొదలెట్టారు కొందరు. 

212

వాస్తవానికి   ఏ చిత్ర నిర్మాతైనా తమ సినిమాల ఒరిజినల్ కలెక్షన్లను ఇంత అని ఖచ్చితంగా చెప్పరు. కొంచెం అటూ ఇటూగానే ఉంటాయి. అంత మాత్రాన అవి ఫేక్ కలెక్షన్స్ అయ్యిపోవు. ఎందుకంటే కల్కి  థియేటర్స్ లో జనం ఉంటున్నారు. పోటీ సినిమా లేదు. తెలుగులోనే కాదు..మిగతా చోట్లా అదే పరిస్దితి., అలాంటప్పుడు కల్కికి తిరుగేముంది. కలెక్షన్స్ ఖచ్చితంగా ఎక్కువే ఉంటాయి. అందులో ప్రభాస్ వంటి స్టార్ ఉండగా ఇంక చెప్పేదేముంది. అలాంటప్పుడు ఫేక్ కలెక్షన్లు చెబుతున్నారు అనటం ధర్మ కాదు. 
 

312

అయినా స్టార్ హీరో  సినిమా విడుదలైన ప్రతిసారీ ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రమే కాకుండా మీడియాలలో ఈ చర్చ జరుగుతుంటుంది. తాజాగా 'కల్కి' సినిమాకు సంబంధించి కూడా ఇటువంటి చర్చే జరుగుతుండటం గమనార్హం. బాహుబలి, ఆర్ఆర్ఆర్, సలార్ రికార్డులను బద్దలుకొట్టి కొత్త రికార్డుల దిశగా సాగుతుందని  ప్రభాస్ అభిమానులు అంచనాలు వేసుకోగా అందుకు విరుద్ధంగా జరుగుతోందంటూ ప్రచారానికి తెర తీసింది ఓ వర్గం.

412

 'కల్కి' సినిమా కలెక్షన్ల  అసలు నిజం ఏమిటి? అంటూ కొందరు డిస్కషన్స్ మొదలెట్టారు. అయితేఇందులో ఎక్కువ శాతం బాలీవుడ్ నుంచే ఉంది. విడుదలైన మొదటిరోజుతో పోలిస్తే ఇప్పటికి కలెక్షన్స్  తగ్గాయి. అలా  వసూళ్లు తగ్గడం అనేది సహజమే అయినప్పటికీ అనుకున్న భారీగా అయితే డ్రాప్ లేదు. కానీ బాలీవుడ్ కు చెందిన సమోసా క్రిటిక్స్ అని చెప్పబడే సుమిత్ ,రోహిత్ అనే ఇద్దరు కల్కి కలెక్షన్స్ పూర్తిగా ఫేక్ అంటూ ప్రచారం సోషల్ మీడియాలో మొదలెట్టారు. ఓ సౌతిండన్ ఫిల్మ్ తమ నార్త్ లో దుమ్ము దులుపుతోందని బాధో మరొకటి మాత్రం తెలియదు. నిర్మాతలను ఫ్రాడ్ అన్నట్లుగా రిపీట్ ట్వీట్స్ వేస్తున్నారు. 

512

అయితే నిర్మాతలు ఈ నెగిటివ్ ప్రాపగాండకు చెక్ పెట్టాలనుకున్నట్లవు తెలుస్తోంది. అందులో భాగంగా వాళ్లకు లీగల్ నోటిసులు పంపినట్లు బాలీవుడ్ సినిమా వర్గాల సమాచారం. సుమిత్, రోహిత్ తాము పోస్ట్ చేసిన కలెక్షన్స్ ఫిగర్స్ సోర్స్ చెప్పమని ఆ లీగల్ నోటిసులలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే డైలీ కలెక్షన్స్ బ్రేకడౌన్ ప్రాంతాల వారిగా కూడా పంపవల్సిందని, వాళ్లు చెప్తున్న కలెక్షన్స్ కు తగినట్లుని , తమ వాదన ప్రూవ్ చేసుకోమని లీగల్ నోటీస్ ద్వారా నిర్మాతలు వాళ్లను కోరారు. ఫలానా టైమ్ లోగా తమకు అందిన లెక్కలు, వాటికి ఉన్న సోర్స్ తెలియచేయవలిసిందని లేకపోతే కనుక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నందుంకు 25 కోట్లు ఫైన్ కట్టమని నోటీస్ ఇచ్చారు. ఇదంతా కూడా బాలీవుడ్ హంగామా అనే  పాపులర్ సైట్ లో వచ్చింది. 
 

612

ఇక సుమిత్ కు ఇలా జరగటం ఈ సంవత్సరంలో ఇది రెండో సారి. సంవత్సరం ప్రారంభంలో క్రాక్ చిత్రం రిలీజ్ టైమ్ లో లీడ్ యాక్టర్, నిర్మాత విద్యుత్ జమాల్ అతని గురించి రాసిన ట్వీట్ అప్పుడు వైరల్ అయ్యింది. అతను సినిమాల గురించి రాయటానికి లంచం అడుగుతున్నారు. నేను ఇవ్వలేదు. అదే నేను చేసిన తప్పు అంటూ వాళ్లు సినిమాల గురించి మంచి గా రాయటానికి డబ్బులు అడుగుతున్నారనే విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేసారు. 
 

712

 కల్కి టీమ్ ఇంత సక్సెస్ అవ్వటానికి కారణం సినిమా ప్రమోషన్‌ విషయంలో కూడా వినూత్న పద్ధతుల్ని అనుసరించారు చిత్రయూనిట్‌. దాంతో సినిమాను ఎప్పుడు థియేటర్లో ఎక్స్‌పీరియన్స్‌ చేద్దామా? అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూశారు. ఆ ప్రభావం వసూళ్లపై తప్పనిసరిగా ఉందని చెప్పొచ్చు. 600కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800కోట్ల బిజినెస్‌ చేసింది.   అందరి అంచనాలను ‘కల్కి 2898ఏడీ’ అందుకున్నాడు? ఊహించినట్టే విజువల్‌ వండర్‌గా సినిమా ఉండటం కలిసొచ్చింది. 

812
Director Nag Ashwin

 మరోవైపు హిందీ ప్రేక్షకులు ‘కల్కి’ మూవీకి ఫిదా అవుతున్నారు. ప్రభాస్‌, అమితాబ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, నాగ్‌ అశ్విన్‌ టేకింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ తదితర సన్నివేశాలు అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌లో రూ.220 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసిన మూవీగా ‘కల్కి’ నిలిచింది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్ఆర్‌’ తర్వాత హిందీలో రూ.200 కోట్లు దాటి వసూలు చేసిన మూవీ ఇదే కావడం గమనార్హం. ఇక ప్రభాస్ సినిమాల పరంగా చూస్తే ఇదే రెండో అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన చిత్రం.
 

912
Kalki Amitabh’s 55-year career

భైరవ పాత్రలో చేసిన పెర్ఫార్మెన్స్, అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ అదరకొట్టే నటన, అంతకు మించి నాగ్ అశ్విన్ మేకింగ్ విజన్ కి ఆడియన్స్ నీరాజనాలు పడుతున్నారు. ఫస్ట్ వీకెండ్ అయ్యాక కలెక్షన్స్ డ్రాప్ అవుతాయేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రమే స్లో అయ్యింది. మిగతా చోట్ల స్ట్రాంగ్  గానే ఉంది.   తెలుగు రాష్ట్రాల్లో సినిమా బుకింగ్స్ కి వస్తే నైజాంలో స్ట్రాంగ్ హోల్డ్ ఉంది.  ఆంధ్ర, సీడెడ్ లలో డ్రాప్ కనిపిస్తోంది.    ఓవర్సీస్ లో అలాగే హిందీలో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపిస్తోంటే... మిగిలిన చోట్ల కొంచం డ్రాప్ కనపడుతోంది.  
  

1012

అయితే భారతీయుడు సినిమాకు నెగిటివ్ టాక్ రావటం, హిందీలో ఈ వారం రిలీజైన అక్షయ్ కుమార్ సినిమా డిజాస్టర్ అవటం కలిసొచ్చింది. అలాగే వీకెండ్ అడ్వాంటేజ్ కూడా సినిమాకి ఇప్పుడు ఉండటంతో కలెక్షన్స్ లో గ్రోత్ మరింతగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి.

1112

  ప్రభాస్ మాట్లాడుతూ.. “కల్కి సినిమాలో నా పాత్ర చాలా గ్రే షేడ్స్‌తో ఉంటుంది. అలాగే, నేను సూపర్‌ హీరోగా కనిపిస్తాను, దానికి హ్యూమర్ టచ్ కూడా ఉంటుంది. కాకపోతే, తెలుగు ప్రేక్షకులు నన్ను ఇలాంటి పాత్రలో ఇంతకు ముందు చూశారు. కానీ ఇతర భాషల్లోని ప్రేక్షకులకు ఈ పాత్రలో నన్ను చూడటం కొత్తగా అనిపిస్తోంది. పైగా గ్రే షేడ్స్‌తో కూడిన ఫన్నీ క్యారెక్టర్‌లో నన్ను నేను చూసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది’ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. 

1212

వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించిన  ఈ చిత్రంలో దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. కల్కి’లో  కమల్ హాసన్‌ విలన్‌గా కనిపించారు. సుప్రీం యాస్కిన్‌ పాత్రను ఆయన (Kamal Haasan) పోషించారు. తాజాగా ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తన పాత్రను అంగీకరించడానికి ఏడాది సమయం తీసుకున్నట్లు తెలిపారు.  ‘ఈ పాత్ర గురించి చెప్పగానే నాకు స్వీయసందేహం వచ్చింది. నేను దీన్ని చేయగలనా అనిపించింది. గతంలో చాలా సినిమాల్లో విలన్‌గా నటించాను. కానీ, ఇది వాటికి మించినది. భిన్నమైన పాత్ర. అందుకే దీనికి సంతకం చేయడానికి ఏడాది ఆలోచించా’ అని చెప్పారు.
 

Read more Photos on
click me!

Recommended Stories