Kajal Aggarwal Pics : ప్రెగ్నెన్సీ టైంలో తన డియరెస్ట్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన కాజల్.. గౌతమ్ కిచ్లు కాదండోయ్..

Published : Mar 30, 2022, 11:09 AM IST

హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. అయితే  ప్రెగ్నెన్సీతో ఇంట్లోనే ఉంటున్న ఈ సుందరి.. గౌతమ్ కిచ్లు కాకుండా తన డియరెస్ట్ ఫ్రెండ్ తో గడుపుతున్నట్టు తెలిపింది.. అసలు విషయం ఎంటంటే..

PREV
16
Kajal Aggarwal Pics : ప్రెగ్నెన్సీ టైంలో తన డియరెస్ట్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన కాజల్.. గౌతమ్ కిచ్లు కాదండోయ్..

సౌత్, నార్త్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో నటించిన కాజల్ అగర్వాల్ దేశవ్యాప్తంగా అభిమానులను సాధించుకుంది. ఈ స్టార్ హీరోయిన్ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గ్లామర్,  నటనతో  తెలుగు, తమిళం, హిందీ ప్రేక్షకులను ఎంతో దగ్గరైంది.
 

26

దాదాపు 18 ఏండ్ల పాటు సినీ ఇండస్ట్రీలో ఉంటూ.. ఇంకా స్టార్ హీరోయిన్ హోదానే కొనసాగిస్తున్న అతికొద్ది మంది హీరోయిన్లలో కాజల్ ఒకరు. కేరీర్ మొదట్లో నాలుగైదేండ్లు కాస్తా ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. Ram Charan ‘మగధీర’ సినిమాతో స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. 
 

36

అప్పటి నుంచి స్టార్ హీరోల సరసన నటిస్తూ వస్తోంది. కాజల్ నటించిన  మగధీర, ఆర్య 2, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, బిసినెస్ మెన్ వంటి చిత్రాలంటే ఇప్పటికీ అభిమానులు ఇష్టపడుతారు. కాజల్ చివరిగా నటించిన చిత్రం ‘హే సినామిక’.. తమిళ చిత్రం అయినా తెలుగులోనూ ఆదరణ పొందింది.
 

46

అయితే రెండేండ్ల కింద ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లును  పెండ్లి చేసుకుంది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది కాజల్. అయితే ప్రెగ్నెన్సీ కారణంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్న  కాజల్ సినిమాలకు దూరంగా ఉంది. కానీ, అభిమానులకు మాత్రం సోషల్ మీడియాలో దగ్గరగానే ఉంటోంది. తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటోంది.
 

56

తాజాగా, ప్రెగ్నెన్సీ టైంలో తన బెస్ట్ ఫ్రెండ్‌తో ప్రత్యేక ఫోటోను షేర్ చేసింది. తన గర్భధారణ సమయంలో తన ప్రియమైన స్నేహితుడిని పరిచయం చేయడం పట్ల కాజల్ సంతోషం వ్యక్తం చేసింది. ఫొటోలు  షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చింది. 

66

ఇంతకీ తన డియరెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే..  ప్రెగ్నెన్నీ పిల్లో అంటూ కాజల్ చెప్పింది.. ‘నా గర్భధారణ సమయంలో నా ప్రియమైన స్నేహితుడు (ప్రెగ్నెన్సీ పిల్లో)ని పరిచయం చేస్తున్నాను. ఈ ప్రెగ్నెన్సీ పిల్లో మెడ, భుజం, వెన్నునొప్పి వంటి వాటిని దరిచేరకుండా చేస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్‌నూ తగ్గిస్తుంది. కంటి నిండ నిద్రతో పాటు..  విలాసవంతమైన అనుభూతి కలుగుతుంది. ఈ దిండు ఎల్లప్పుడూ అత్యంత సౌకర్యవంతంగా  ఉంటుంది’ అని వివరించింది.


 

click me!

Recommended Stories