Ntr: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఆయన నటిస్తున్న 'వార్ 2' సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు సోషల్ మీడియాలో ఆందోళన చేస్తున్నారు.
ఇవి సోషల్ మీడియా రోజులు. తమ సంతోషం అయినా, నిరసన అయినా ప్రతీదీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రెటీలకు సంభందించిన విషయాలకు ఇది మరింతగా మారింది.
తెలుగులో అయితే పెద్ద హీరోల సినిమాలు లేటు అయినా లేదా ప్రమోషన్ మెటీరియల్ వదలకపోయినా రచ్చ చేస్తున్నారు అభిమానులు. మొన్నటిదాకా గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కోసం మెగాభిమానులు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేసినట్లే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ 2 కోసం మొదలెట్టారు.
23
War 2
గతేడాది దేవర తో ఎన్టీఆర్ అభిమానులకు పండగ చేసారు. వారంతా ఇప్పుడు వార్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఎన్టీఆర్ హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టడం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ 60 శాతానికి పైగా పూర్తయింది . అలాగే ఎన్టీఆర్ మీద తీసే పార్ట్ ఫిబ్రవరి చివరి నాటికి ఒక పాట మినహా పూర్తవుతుంది.
వార్ 2 నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక అప్‌డేట్‌లను విడుదల చేయటం మొదలెట్టలేదు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఉన్న ఒక్క పోస్టర్ కూడా బయటకు వదలలేదు. ఈ సినిమా గురించి ఒక్క అప్‌డేట్ కూడా రాకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రొడక్షన్ హౌస్‌ని సోషల్ మీడియాలో రచ్చ చేయటం మొదలెట్టారు.
33
war2
షూటింగ్ అప్‌డేట్‌లు, సినిమాలో ఎన్టీఆర్ పాత్రమిటి తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్, ముంబై విమానాశ్రయాల్లో ఎన్టీఆర్ తరచుగా కనిపిస్తూనే ఉండటం తప్పించి సినిమా గురించి ఏమీ తెలియకపోవటమే కారణం. ఈ సినిమాలోని ఎన్టీఆర్ లుక్ కూడా సీక్రెట్ గా ఉంచారు.
వార్ 2 లో ఎన్టీఆర్ సౌత్ ఇండియా ఆధారిత RAW ఏజెంట్‌గా నటిస్తున్నాడని , యాక్షన్ స్టంట్స్ మెయిన్ హైలైట్ అని బాలీవుడ్ మీడియా అప్పుడప్పుడూ చెబుతోంది. కైరా అద్వానీ హీరోయిన్ . అయాన్ ముఖర్జీ దర్శకుడు, ఆదిత్య చోప్రా నిర్మాత. వార్ 2 ఈ సంవత్సరం ఆగస్ట్ 15, స్వాతంత్ర్య దినోత్సవం కు పాన్-ఇండియన్ రిలీజ్ కు వెళుతోంది.