బార్బీ డాల్ లుక్ లో చాందిని చౌదరి.. స్టన్నింగ్ పోజులతో అట్రాక్ట్ చేస్తున్న ‘కలర్ ఫొటో’ బ్యూటీ

First Published | Jun 30, 2023, 3:27 PM IST

‘కలర్ ఫొటో’ హీరోయిన్ చాందిని చౌదరి ప్రస్తుతం మరిన్ని అవకాశాల కోసం ఎదరుచూస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ లుక్ లో అట్రాక్ట్ చేసింది.
 

తెలుగు యంగ్ హీరోయిన్  చాందినీ చౌదరి (Chandini Chowdary)  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ‘కలర్ ఫొటో’తో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.
 

షార్ట్ ఫిల్మ్స్  నుంచి కేరీర్ ను ప్రారంభించిన చాందిని నటిగా సినిమా అవకాశాలు అందుకునే రేంజ్ కు ఎదిగింది. ఎనిమిదేళ్ల కింద వచ్చిన ‘కేటుగాడు’ చిత్రంతో నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత పెద్దహీరోల చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లోనూ నటించి మెప్పించింది. 
 


బొంభాట్, సూపర్ ఓవర్ వంటి ఓటీటీ చిత్రాలతోనూ అలరించింది. చివరిగా యంగ్ స్టార్ కిరణ్ అబ్బవరం సరసన ‘సమ్మతమే’ చిత్రంలో మెరిసింది. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ‘కలర్ ఫొటో’ లాంటి మంచి హిట్ తర్వాత మరో హిట్ కోసం చూస్తోంది.
 

కానీ, ప్రస్తుతం చాందిని చౌదరి చేతిలో పెద్దగా ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. ‘గామీ’ అనే ఓ చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందీ చిత్రం. ఇది రిలీజ్ కు సిద్ధంగా ఉండటంతో నెక్ట్స్ ఆఫర్ల కోసం ప్రయత్నిస్తోంది. 

ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ తన అభిమానులను పలకరిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ దర్శక నిర్మాతల కంట్లోనూ పడేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది.
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ బార్బీ డాల్ లుక్ లో మెరిసింది. స్కిన్ టైట్ లెగిన్, పింక్ బ్లేజర్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. కిర్రాక్ ఫోజులిస్తూ కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంది. చాందిని నయా లుక్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లు పెడుతున్నారు. 
 

Latest Videos

click me!