Ranbir-Alia Wedding : రణ్ బీర్ కపూర్, అలియా భట్ వెడ్డింగ్ ఈ తేదీల్లోనే? బ్యాచిలర్ పార్టీకి రెడీ అయిన రణ్ బీర్!

Published : Apr 05, 2022, 05:06 PM IST

బాలీవుడ్ స్టార్స్ రణ్ బీర్ కపూర్ - అలియా భట్ ఏండ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ ఒక్కటవుతున్నటు బీటౌన్ లో తెగ చర్చ నడుస్తోంది. ఈ మేరకు ఈ నెలలోనే వీరి వెడ్డింగ్ జరగనున్నట్టు తెలుస్తోంది.

PREV
17
Ranbir-Alia Wedding : రణ్ బీర్ కపూర్, అలియా భట్ వెడ్డింగ్ ఈ తేదీల్లోనే? బ్యాచిలర్ పార్టీకి రెడీ అయిన రణ్ బీర్!

అభిమానులు, సినీ వర్గ ప్రముఖులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్షణం.. బాలీవుడ్ స్టార్స్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ (Ranbir-Alia Wedding) వివాహా సమయం.  వీరిద్దరి వెడ్డింగ్ పై ఇప్పటికే బీటౌన్ లో హాట్ టాపిక్ కొనసాగుతోంది.
 

27

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ (Alia Bhatt) కొన్నేండ్లుగా చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్టార్స్ త్వరలో ఒక్కటి కాబోతున్నట్టు వస్తున్న వార్తలను ఇప్పటికైతే ఇరు కుటుంబాలు స్పష్టం చేయలేదు. 
 

37

అదే విధంగా అలియా, రణ్ బీర్ కపూర్ వెడ్డింగ్ పై వస్తున్న వార్తలనూ ఇరువురు ఖండించకపోవడంతోనూ అభిమానులు, ప్రేక్షకులు, బీటౌన్ లో ఈ నెలలోనే వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 

47

తాజా సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 17 మధ్య అలియా భట్ - రణ్ బీర్ కపూర్ వెడ్డింగ్ అంగరంగ వైభంగా జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లు చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ జంట ఇంత సడెన్ గా పెండ్లి చేసుకోవాలనుకోవడానికి కూడా ఓ కారణం ఉందని తెలుస్తోంది. 
 

57

అలియా భట్ తల్లితండ్రుల ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఈ జంట తమ వివాహాన్ని ఏప్రిల్ రెండోవారంలోనే ముహుర్తం పెట్టినట్టు తెలుస్తోంది. పక్కాగా ఏప్రిల్ 17న వివాహ తేదీగా నిర్ణయించినట్టు ఈ జంటకు చెందిన సన్నిహితుల నుంచి సమాచారం.  
 

67

రణబీర్ మరియు అలియా ఇద్దరూ చెంబూర్‌లోని ఆర్‌కె స్టూడియోస్ సైట్ లాజిస్టిక్‌లను వర్కవుట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే పెళ్లి కోసం షాదీ స్క్వాడ్ మరియు మెహందీ నిపుణుడు వీణా నగ్దాను సంప్రదించినట్లు ఇటీవలి పలు నివేదికలు సూచిస్తున్నాయి. 
 

77

మరోవైపు రణ్ బీర్ కపూర్ కూడా తన చిన్ననాటి స్నేహితులకు, సన్నిహితులకు బ్యాచిలర్ పార్టీ కూడా ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. తన మిత్రులు అర్జున్ కపూర్, అదిత్యా రాయ్ కపూర్, అయాన్ ముఖర్జీ పార్టీకి అటెండెంట్ కానున్నట్టు సమాచారం. ఏదేమైనా మరికొద్ది రోజుల్లో పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంది.

click me!

Recommended Stories