Prabhas: 2011లో విడదులైన ‘Mr. పర్‌పెక్ట్’ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది. ప్రభాస్, కాజల్, తాప్సీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సీనియర్ దర్శకుడు దశరథ్ దర్శకత్వం వహించారు.
అయితే ఈ చిత్ర కథ ‘నా మనసు కోరింది నిన్నే’ అనే తన నవల నుండి కాపీ కొట్టారంటూ.. ప్రముఖ రచయిత్రి శ్యామలా దేవి కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో ట్రయల్‌కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది.
అయితే ఈ సమస్య పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని, లేదంటే ఇబ్బందుల్లో పడతారని సోమవారం దిల్‌రాజు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డిని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది.