'రాధే శ్యామ్' లొకేషన్ లో ప్రభాస్..కొత్త ఫొటోలు,కరోనా తలనొప్పి
ప్రభాస్ ప్రస్తుతం 'రాధే శ్యామ్' షూటింగ్ కోసం ఇటలీలో ఉన్న సంగతి తెలిసిందే. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. పిరీడ్ డ్రామాగా ఇటలీ నేపథ్యంగా ఈ చిత్ర కథ సాగుతుంది. దీంతో గత కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగును ఇటలీలోని పలు లొకేషన్లలో నిర్వహిస్తున్నారు. ముఖ్య సన్నివేశాలతో పాటు హీరో హీరోయిన్లు ప్రభాస్, పూజ హెగ్డే జంటపై కొన్ని పాటలను కూడా అక్కడ షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటలీలో కరోనా వ్యాప్తి ఉన్న నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ జరుపుతున్నారు. తాజాగా, రాధేశ్యామ్ షూటింగ్ లొకేషన్లలో ప్రభాస్, బాలీవుడ్ లేడీ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ తో దిగిన సెల్ఫీలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.