సర్దార్ గబ్బర్ సింగ్ నటి సంజన అరెస్ట్: కొంప ముంచిన మిత్రుడు

First Published Sep 9, 2020, 9:36 AM IST

సంజన స్నేహితుడు రాహుల్ మత్తు పదార్థాల విక్రయదారుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. అతనితో పాటు వెంట్ మేనేజ్ మెంట్ నిర్వాహకుడు పృథ్వీ శెట్టి వెల్లడించిన విషయాలే సంజన గల్రానీ కొంప ముంచాయి.

మాదక ద్రవ్యాల వ్యవహారం శాండిల్ వుడ్ లో వణుకు పుట్టిస్తోంది. సినీ పరిశ్రమను ఆ కేసు చుట్టుముడుతోంది. సినీ నటి రాగిణి ద్వివేదిని బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ శాఖ (సీసీబీ) ఇంతకు ముందు అరెస్టు చేశారు.
undefined
తాజాగా మంగళవారంనాడు సర్దార్ గబ్బర్ సింగ్ నటి సంజన గల్రానీని అరెస్టు చేసింది. విచారణ నిమిత్తం ఆమెను ప్రత్యేక వాహనంలో సీసీబీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించి, తర్వాత ఆమె అరెస్టును ప్రకటించారు.
undefined
సంజన స్నేహితుడు రాహుల్ మత్తు పదార్థాల విక్రయదారుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. అతనితో పాటు వెంట్ మేనేజ్ మెంట్ నిర్వాహకుడు పృథ్వీ శెట్టి వెల్లడించిన విషయాలే సంజన గల్రానీ కొంప ముంచాయి.
undefined
సంజన ఇంటిలోకి ప్రవేశించిన సీసీబీ అధికారులు ఆమె వాడుతున్న సెల్ ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు ఆఫీసర్ అంజుమాల నేతృత్వంలోని నలుగురు అధికారులు సంజనపై ప్రశ్నల వర్షం కురిపించారు.
undefined
శ్రీలంకలో గతంలో నిర్వహించిన బ్యాలీ క్యాసినో కార్యక్రమాలకు తన స్నేహితుడు రాహుల్ తో పాటు సంజన తరుచుగా హాజరు కావడం కేసులో కీలకమైన అంశంగా మాిరంది.
undefined
బిటీఎంం లేఔట్ నివాసి షేక్ ఫైజాల్లా ఆమెను బ్యాలి క్యాసినోను పరిచయం చేశాడు. సినీనటులు, సంపన్నులు, రాజకీయ నేతలు తరుచుగా ఆ క్లబ్ కు వెళ్లి వస్తుంటారు. అలాగే తాను కూడా వెళ్లినట్లు సంజన చెప్పింది.
undefined
రాహుల్ తో సంజన సహజీవనం సాగిస్తోంది. అతనితో పాటు మరికొందరు మిత్రులు ఆమెను శ్రీలంకలోని క్లబ్ కు తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. సంజనకు మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా వ్యవహారాలతో సంబంధం ఉందని న్యాయవాది సంబరగి ఆరోపించారు. ఈ ఆరోపణలను సంజన సోమవారంనాడు ఖండించారు. ఆ తర్వాతి రోజునే ఆమె కటకటాలను లెక్కించాల్సి వచ్చింది.
undefined
సంజనతో కాంగ్రెసు పార్టీకి చెందిన ఓ శాసనసభ్యుడు శ్రీలంక వెళ్లి వచ్చినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చామరాజపేట శాసనసభ్యుడు జమీర్ అహ్మద్ ఖాన్ శ్రీలంకలోని బ్యాలీ కాసినో క్లబ్ కు వెళ్లి వచ్చినట్లు న్యాయవాది ప్రశాంత్ సంబరగి ఆరోపించారు. ఆ శాసనసభ్యుడి ముఖం కూడా తాను చూడలేదని సంజన చెప్పింది.
undefined
ఇదిలావుంటే, సినీనటి, పార్లమెంటు సభ్యురాలు సుమలత కీలకమైన ప్రకటన చేశారు. మాదక ద్రవ్యాల విషయంలో సినీ పరిశ్రమను వేలెత్తి చూపడం సరి కాదని అన్నారు. ప్రతి రంగంలో కూడా మంచీచెడులు ఉంటాయని, తాను డ్రగ్స్ ను చూడలేదని అన్నారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆమె అన్నారు. అప్పటి వరకు వేచి చూడాలని ఆమె అన్నారు. ఆరోపణలు రుజువయ్యేంత వరకు ఎవరికి వారు తీర్పులు వెల్లడించడం సరి కాదని సుమలత అన్నారు.
undefined
click me!