పిల్లల్లు చెడిపోతున్నారు... ఓటీటీలపై బాలీవుడ్ నటి అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు..

Published : Jul 09, 2023, 05:14 PM IST

టీటీ ప్లాట్ ఫామ్స్ పై మండిపడింది బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్. ఓటీటీల వల్ల చిన్న పిల్లలు చెడిపోతున్నారని. ఈ విషయంలో త్వరగా మేలుకోపోతే.. సమాజానికి మంచిది కాదన్నారు అమీషా.. ఇంతకా ఆమె ఇంకా ఏమంటున్నారంటే..?   

PREV
16
పిల్లల్లు చెడిపోతున్నారు... ఓటీటీలపై బాలీవుడ్ నటి అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు..

బాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా వెండితెరను ఒక ఊపుఊపి వదిలిపెట్టింది హీరోయిన్ అమీషా పటేల్. ఇక ప్రస్తుతం సీనియర్ యాక్ట్రస్ గా అడపా దడపా సినిమాలు చేసుకుంటుంది. ఇక ఆమె రీసెంట్ గా నటించిన గదర్ 2 సినిమా.. మరో నెల రోజుల్లో  రిలీజ్ కాబోతోంది. ఈసినమాపై  బాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో సన్నిడియోల్‌గా జోడీగా నటించింది  అమీషా పటేల్‌. 

26

ఇక ఈ సినిమా రిలీజ్‌ కు ఎక్కువ టైమ్ లేకపోవడంతో.. ప్రమోషన్లు జోరు పెంచింది అమీషా. వరుసగా ఈ వెంట్లు.. ఇంటర్వ్యూలు అంటూ  గడిపేస్తోంది.   బ్యాక్‌ టు బ్యాక్ ఇంటర్వ్యూలతో తెగ బిజీ అయిప్యింది. ఇక తజాగా ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓటీటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓటీటీలల్లో క్లిన్ కంటెంట్ ఉండట్లేదని ఆరోపించింది.  

36

ప్రస్తుతం ఓటీటీల్లో క్లీన్ కంటెంట్ కంటే కూడా.. స్వలింగ సంపర్కం, గే-లెస్బియానిజం ఎక్కువైపోయిందంటూ.. సంచల కామెంట్స్ చేసింది అమీషా. అంతే కాదు ఇలాంటి వాటిని పిల్లలకు దూరంగా ఉంచాలని.. కాని అవి పిల్లలకే ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయని.. అమీషా పటేల్ వెల్లడించింది. ఇక అందుకే పిల్లలు చూసేందకు  మంచి కంటెంట్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి అన్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే యుగం ఇది కాదని తెలిపింది.

46

బాలీవుడ్ స్టార్  అమీషా చేసిన ఈ వ్యాఖ్యలపై రకరకాల అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. కొంత మంది ఈ విషయంలో అమీషాను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూంటే.. మీరికొంత మంది నెటిజన్లు మాత్రం ఈ వాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇక అమీషా వ్యాఖ్చలు అటు ఫిల్మ్ ఇండస్ట్రీ లో కూడా చర్చనీయాంశం అయ్యాయి. 

56

హృతిక్‌ రోషన్‌ హీరోగా కహో నా.. ప్యార్‌ హే సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది సొట్టబుగ్గల అమీషా పాటేల్‌. అప్పట్లో ఈ సినిమా రికార్డుల పంట పండించింది. ఇకఅదేఏడాది ఆమె టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్  జోడీగా బద్రి సినిమా చేసింది‌. ఈ సినిమా ఇక్కడ బంపర్‌ హిట్టయింది. ఇలా ఒకే ఏడాది రెండు ఇండస్ట్రీలలో ఎంట్రీ ఇచ్చి.. రెండిట్లోనూ బ్లాక్‌ బస్టర్‌లు కొట్టిన ఘనత అమీషా పటేల్‌కే దక్కింది‌. 

66

వరుస సినిమాలు..బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు కొట్టిన అమీషా ఆతరువాత బిజీ ఆర్టిస్ట్ అయ్యింది. అయితే ఆమె సౌత్ నుమాత్రం  మర్చిపోలేదు. ప్రస్తుతం అమీషా సౌత్ సినిమాల్లో నటించాలని ఆశతో ఉన్నట్టు తెలుస్తోది. 2018లో వచ్చిన భయ్యాజీ సూపర్‌ హిట్ సినిమాలో కనిపించింది. ఇక ఇప్పుడు మళ్లీ ఐదేళ్ల తర్వాత గదర్‌-2తో రీ ఎంట్రీ ఇస్తుంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యలో తెరకెక్కిన ఈ సినిమా 2001లో వచ్చిన గదర్: ఏక్‌ ప్రేమ్ కథా సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. ఆగస్టు 11న విడుదల కాబోతున్న ఈ సినిమాపై హిందీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories