చుడీదార్ లో యాంకర్ శ్రీముఖి బ్యూటీఫుల్ లుక్.. చిలిపి పోజులతో కట్టిపడేస్తున్న బుల్లితెర రాములమ్మ..

First Published | May 31, 2023, 1:13 PM IST

యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెరపై దూసుకుపోతోంది. వరుస షోలతో సందడి చేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. 
 

బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి (Sreemukhi) దాదాపు అందరికీ పరిచయమనే చెప్పాలి.  ‘పటాస్’ కామెడీ షోతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలో మంచి క్రేజ్ ను దక్కించుకుంది. కొద్ది సమయంలోనే స్టార్ యాంకర్ గా మారింది.
 

మంచి రేటింగ్ దక్కించుకున్న టీవీషోలకు హోస్ట్ గా వ్యవహరించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. అలాగే బుల్లితెర ఆయా ఈవెంట్లలో అందాలను ఒళకబోస్తూ ఆడియెన్స్ ను కట్టిపడేసింది. తన గ్లామర్, చలాకీతనంతో ఆకట్టుకుంది.
 


యాంకర్ గా తన కేరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నటిగానూ వెండితెరపై అలరిస్తోంది. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ వస్తోంది. బుల్లితెరపై కొనసాగుతూనే యాంకర్ అనసూయ, రష్మీలాగా సినిమా అవకాశాలకు ప్రయత్నిస్తోంది.
 

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా  కనిపిస్తోంది. తన గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. ఎక్కువగా ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్  వేర్స్ లో మెరుస్తూ వస్తోంది. తాజాగా కూడా చుడీదార్ లో దర్శనమిచ్చింది. 
 

లేటెస్ట్ ఫొటోస్ లో శ్రీముఖి బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. ఏమాత్రం గ్లామర్ షోకు ఛాన్స్ లేకుండా తన క్యూట్ లుక్స్ తో కట్టిపడేసింది. చిలిపి పోజులతో, అదిరిపోయే సెల్ఫీలతో ఆకట్టుకుంది. దీంతో ఫ్యాన్స్ సింపుల్ గా చాలా బాగున్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.
 

ప్రస్తుతం శ్రీముఖి కేరీర్ కు ఢోకా లేదు. ఆదివారం స్టార్ మా విత్ పరివారం, కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ వంటి షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’లో కీలక పాత్రలో కనపించబోతోంది. ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Latest Videos

click me!