Sree Mukhi Photos : యాంకర్ శ్రీముఖి ఉగాది స్పెషల్ ట్రీట్.. లెహంగా వోణీలో మతిపోయేలా రాములమ్మ ఫోజులు

Published : Mar 31, 2022, 05:51 PM IST

బుల్లితెర బ్యూటీ, యాంకర్ శ్రీముఖి (Sree Mukhi) తనలో దాగిఉన్న రాములమ్మను ఉగాది సందర్భంగా మరోసారి పరిచయం చేసింది. లెహంగా వోణీలో అందాలను విందు చేస్తోంది.   

PREV
18
Sree Mukhi Photos : యాంకర్ శ్రీముఖి ఉగాది స్పెషల్ ట్రీట్.. లెహంగా వోణీలో మతిపోయేలా రాములమ్మ ఫోజులు

స్టార్ యాంకర్  శ్రీముఖి బుల్లి తెరపై తెగ సందడి  చేస్తోంది. రియాలిటీ  షోలు, స్పెషల్ ఈవెంట్లతో టెలివిజన్ ఆడియెన్స్ ను అలరిస్తోంది. తన  అద్భుత యాకరింగ్ స్కిల్స్ తో తన క్రేజ్ పెంచుకుంటోంది. 

28

ప్రస్తుతం శ్రీముఖి జీతెలుగు (Zee Telugu)తో ప్రసారమవుతున్న ‘స రి గ మ ప : సూపర్  సింగింగ్ సూపర్ స్టార్’ (SaReGaMaPa) సింగింగ్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. మరోవైపు సినిమాల్లోనూ అవకాశాలను దక్కించుకుంటోంది.
 

38

టీవీ ప్రేక్షకులకు ఎంతో  దగ్గరైన శ్రీముఖి అటూ సినిమాలపైనా ఫోకస్ పెడుతోంది. జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, నేను శైలజ,  జెంటిల్ మెన్, 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా?, చివిగా నితిన్ నటించిన ‘మ్యాస్ట్రో’ చిత్రంలో లక్కీ అనే పాత్రలో కనిపించింది.
 

48

అయితే, తనకు సినిమాల్లో దక్కుతున్న పాత్రలు పెద్దగా ప్రాధాన్యతను సంతరించుకోకపోవడంతో శ్రీముఖికి కూడా పెద్ద ఆఫర్లు రావడం లేదు. కానీ ఈసారి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న ‘భోళా శంకర్’ (Bhola Shankar) చిత్రంలో ఓ రోల్ చేయనుంది. 
 

58

భోళా శంకర్ లో మంచి వేయిట్ ఉన్న పాత్ర దక్కితే మాత్రం శ్రీముఖి కేరీర్ మరో మలుపు తిరుగుతుందనే చెప్పాలి. ఇప్పటికే సినిమాల కోసం ఈ బ్యూటీ తెగ ప్రయత్నిస్తున్న  విషయం తెలిసిందే. ఇప్పటికే అనసూయ బుల్లితెర నుంచి వెండితెరకు బంగారు బాటలేసుకుంది. శ్రీముఖి కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. 
 

68

బుల్లితెర రాములమ్మగా పేరుతెచ్చుకున్న శ్రీముఖి ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. ఫ్యాన్స్ తో లైవ్ మీట్, చాట్ సెషన్స్ నిర్వహిస్తూ వారికి ఎల్లప్పుడూ టచ్ లో ఉంటుంది. అంతేకాకుండా లేటెస్ట్ ఫొటోషూట్లతో నెటిజన్లను ఖుషీ చేస్తుంటుంది కూడా. 
 

78

అయితే ఉగాది పండుగ సందర్భంగా తను హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘సరిగమప’ సింగింగ్ రియాలిటీ షోలో ఉగాది స్పెషల్ ఎపిసోడ్ ను షూట్ చేయనున్నారు. ఈ మేరకు శ్రీముఖి సంప్రదాయ  దుస్తుల్లో లేటేస్ట్ ఫొటోషూట్ నిర్వహించింది. ఆఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. 
 

88

ఈ ఫొటోల్లో శ్రీముఖి తనలో దాగి ఉన్న  రాములమ్మను మరోసారి నెటిజన్లకు పరిచయం చేసింది. పింక్ ఎంబ్రాయిడింగ్ లెహంగా, రెడ్ వోణీ, జ్యూవెల్లరీ, ముక్కుపుడుక ధరించి అలనాటి హీరోయిన్ విజయశాంతిని గుర్తు చేసింది. కాగా, ఈ ఆదివారం జీతెలుగులో ప్రసారం  కానున్న సరిగమప ఉగాది స్పెషల్ ఎపిసోడ్ కోసం  ఇలా రెడీ అయినట్టు తెలిపింది. 
 

click me!

Recommended Stories