Today Horoscope:ఓ రాశివారికి ఈ రోజు తలపెట్టిన పనులు ఎన్ని కష్టాలు ఎదురైనా పూర్తి కాగలవు.

First Published Feb 22, 2024, 5:30 AM IST

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు.. దేవాలయ సందర్శన. వృత్తి వ్యాపారాలలో లాభాలు. బంధుమిత్రుల కలయిక ఇతరులకు సహాయం చేస్తారు. గృహములో సుఖసంతోషాలు. శుభవార్తలు వింటారు.
 

Horoscope


22-2-2024  గురువారం మీ  రాశి ఫలాలు  (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

మేషం (అశ్విని 1 2 3 4 భరణి 1 2 3 4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు) వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. చేపట్టిన పనులు పూర్తి  కాగలవు. ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి.

భరణి నక్షత్రం వారికి  (దినపతి బుధుడు) విలువైన గృహోపకరణములు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన విశేషాలు వింటారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా ధన లాభం పొందగలరు.

కృత్తిక నక్షత్రం వారికి  (దినపతి శుక్రుడు) వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ధన లాభాలు పొందగలరు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పనులు పూర్తి కాగలవు.

దిన ఫలం:-అనవసరమైన ఆలోచనలు కలుగుతాయి. వ్యవహార విషయాల్లో ఇతరుల సహాయం తీసుకోవాలి . వృత్తి వ్యాపారాల్లో అడ్డంకులు ఏర్పడిన ధన లాభం చేకూరుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గకుండా వ్యవహరించాలి. ఆకస్మికంగా ఊహించని అధిక ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకొనవలెను. పనుల్లో ఆటంకాలు ఏర్పడిన పూర్తి కాగలవు.ఓం గోవిందాయనమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి (దినపతి రాహువు) ముఖ్యమైన పనుల లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు రాగలవు.

మృగశిర నక్షత్రం వారికి (దినపతి రవి) ఉద్యోగాలలో అధికారులు తో చిన్నపాటి వివాదాలు రాగలవు. వివాదాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది.

దిన ఫలం:-శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది .శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలం. పై అధికారుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఓం వేంకటేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి (దినపతి కుజుడు) వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తలచిన కార్యాలు లో అవాంతరాలు కలుగును. ఇంటా బయట గందరగోళ పరిస్థితి.

పునర్వసు నక్షత్రం వారికి (దినపతి గురుడు) ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తలచిన వ్యవహారాలు పూర్తి కాగలవు. ప్రముఖులతో పరిచయాలు.

దిన ఫలం:-ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సహోద్యోగులతో సఖ్యతగా ఉండాలి. మిత్రుల సహకారంతో పనులలో ఇబ్బందులు లేకుండా సజావుగా పూర్తి కాగలవు. శారీరక బాధలు పెరుగును. అధికారుల వలన భయాందోళనగాఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి మిత్రులతో చర్చాగోష్టి.కోర్టు వ్యవహారాలు అనుకూలం.ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి (దినపతి శని) చేపట్టిన పనులలో అధిక శ్రమ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పని ఒత్తిడి పెరుగుతాయి.

ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి కేతువు ) వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురవగలవు. వివాదాలకు కలహాలకు దూరంగా ఉండటం మంచిది.

దిన ఫలం:-దేవాలయ సందర్శన. వృత్తి వ్యాపారాలలో లాభాలు. బంధుమిత్రుల కలయిక ఇతరులకు సహాయం చేస్తారు. గృహములో సుఖసంతోషాలు. శుభవార్తలు వింటారు.శుభకార్యాలకు శ్రీకారం. తలపెట్టిన పనులు ఎన్ని కష్టాలు ఎదురైనా పూర్తి కాగలవు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వాహన ప్రధానాలయందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు .ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


సింహం (మఖ 1 2 3 4 పుబ్బ 1 2 3 4 ఉత్తర 1)
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు) వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. చేపట్టిన పనులు పూర్తి  కాగలవు. ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి.

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి బుధుడు) విలువైన గృహోపకరణములు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన విశేషాలు వింటారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా ధన లాభం పొందగలరు.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి శుక్రుడు) వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ధన లాభాలు పొందగలరు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పనులు పూర్తి కాగలవు .

దిన ఫలం:-బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఊహించని విధంగా ధన లాభం పొందుతారు.నూతన ఆలోచనలు చేస్తారు. నూతనవస్తు ఆభరణాలను మరియు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.రావాల్సిన బకాయిలు వసూలగును. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు.ఓం రుద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పీ-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి రాహువు) ముఖ్యమైన పనుల లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు రాగలవు.

చిత్త నక్షత్రం వారికి (దినపతి రవి) ఉద్యోగాలలో అధికారులు తో చిన్నపాటి వివాదాలు రాగలవు. వివాదాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది.

దిన ఫలం:-చేసే పనులలో ఆటంకాలు.శారీరక కష్టం అధికంగా ఉంటుంది .అనవసరమైన ఆలోచనలు చేస్తారు. సంఘంలో అపనిందలు ఎదుర్కోవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. క్రయవిక్రయాలు లో తెలివిగా వ్యవహరించాలి. మానసిక చికాకులు. ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి. చేయు పనులలో కోపం అధికంగా ఉండును.అపవాదములు రాగలవు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనవసరమైన పనులు లో ఆసక్తి  పెరుగుతుంది. ఓం వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తలచిన కార్యాలు లో అవాంతరాలు కలుగును. ఇంటా బయట గందరగోళ పరిస్థితి.

విశాఖ  నక్షత్రం వారికి  (దినపతి గురుడు) ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తలచిన వ్యవహారాలు పూర్తి కాగలవు. ప్రముఖులతో పరిచయాలు.

దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. అకారణంగా కోపం ఉద్రేకం పెరుగుతాయి.అనవసర ఖర్చులు. పనుల యందు నిరాసక్తత. సేవకుల వలన ఇబ్బందులుంటాయి.వాదోపవాదాలకు వేయడం మంచిది కాదు. గృహ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఎదురౌతాయి.ధనాదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. ఇతరులతో కఠినంగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులకు గురి అవుతారు. వ్యవహారాల్లో  తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి శని) చేపట్టిన పనులలో అధిక శ్రమ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పని ఒత్తిడి పెరుగుతాయి.

జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి కేతువు ) వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురవగలవు. వివాదాలకు కలహాలకు దూరంగా ఉండటం మంచిది.

దిన ఫలం:-బంధుమిత్రులతో కలహాలు. చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.జీవిత భాగస్వామితో సఖ్యత గా మెలగాలి. ఉద్యోగాల్లో అధికారులతో చిక్కులు. సంఘాల్లో తెలివిగా వ్యవహరించాలి. అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడతాయి.అనేక రకాల ఆలోచనలతో విసుగు చెందుతారు. మానసిక చికాకులు.ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి. చేయు పనులలో కోపం అధికంగా ఉండును.అపవాదములు రాగలవు .ఓం కాలభైరవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భ-భీ-భూ-ధ-ఫ-ఢ-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు) వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. చేపట్టిన పనులు పూర్తి  కాగలవు. ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి.

పూ.షాఢ నక్షత్రం వారికి (దినపతి బుధుడు) విలువైన గృహోపకరణములు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన విశేషాలు వింటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన విధంగా ధన లాభం పొందగలరు.

ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు) వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ధన లాభాలు పొందగలరు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పనులు పూర్తి కాగలవు.

దిన ఫలం:-శుభవార్తలు వింటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. కళలయందు ఆసక్తి చూపుతారు. స్వతంత్రంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు. దూరం ప్రాంతము నుండి శుభవార్తలు వింటారు. వ్యాపార అభివృద్ధికి తగిన చర్చలు జరుపుతారు. కష్టపడి చేసిన పనిలో విజయం సాధిస్తారు.ఓం ఓం కేశవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి (దినపతి రాహువు) ముఖ్యమైన పనుల లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు రాగలవు.

ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి రవి) ఉద్యోగాలలో అధికారులు తో చిన్నపాటి వివాదాలు రాగలవు.వివాదాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది.

దిన ఫలం:-వ్యాపార సంబంధమైన వ్యవహారాలలో ధన లాభం. ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వ్యక్తులు పరిచయాలు ఏర్పడతాయి.శుభవార్తలు వింటారు. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు. బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారములో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. ఓం నారసింహాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4 శతభిషం 1 2 3 4 పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సూ-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి (దినపతి కుజుడు) వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తలచిన కార్యాలు లో అవాంతరాలు కలుగును. ఇంటా బయట గందరగోళ పరిస్థితి.

పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి గురుడు) ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తలచిన వ్యవహారాలు పూర్తి కాగలవు. ప్రముఖులతో పరిచయాలు.

దిన ఫలం:-విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని పనులు అనుకూలంగా పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలలో లాభాలుంటాయి. రావాల్సిన బకాయిలు వసూలగును. పోయిన వస్తువులు లభిస్తుంది. సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును సంఘంలో పెద్ద వారి ఆదరణ పొందుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దేవాలయ దర్శనం. దానధర్మాలు చేస్తారు.ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు(దీ-దూ.ఝ-ధా-దే-దో-చా-చి)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి  (దినపతి శని) చేపట్టిన పనులలో అధిక శ్రమ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పని ఒత్తిడి పెరుగుతాయి.

రేవతి నక్షత్రం  వారికి  (దినపతి కేతువు ) వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురవగలవు. వివాదాలకు కలహాలకు దూరంగా ఉండటం మంచిది.

దిన ఫలం:-అనవసరమైన కలహాలకు వాదనలకు చెడు స్నేహాలు దూరంగా ఉండాలి.మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కష్టించిన పనిలో లాభం చేకూరును. నూతన సమస్యలు ఏర్పడతాయి.అవసరమైన దురాలోచనలు కలుగును.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికారులు తో సమస్యలు.వ్యాపారంలో ధన నష్టం రాకుండా జాగ్రత్త తీసుకోవాలి.వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

click me!