ఎవరీ మహ్వశ్?
టీమిండియా క్రికెటర్ చాహల్ తో కనిపించిన మిస్టరీ గర్ల్ మహ్వశ్ ది ఉత్తర ప్రదేశ్. అలీగఢ్ లో పుట్టిపెరిగిన ఈమె దేశ రాజధాని డిల్లీలో ఉన్నత విద్యాభ్యాసం చేసారు. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్స్ చేసిన మహ్వశ్ సినీ రంగంపై ఆసక్తిని పెంచుకున్నారు.
అయితే సినిమాల్లోకి వెళ్ళాలంటే ముందుగా మంచి గుర్తింపు పొందాలని భావించిన ఆమె యూట్యూబ్ లో ప్రాంక్ వీడియోలు చేసింది. ఆమె మహిళా సాధికారతతో పాటు అమ్మాయిల భద్రతకు సంబంధించిన అనేక ఫ్రాంక్ వీడియోలు చేసారు. ఇలా దేశంలో మొదటి మహిళా ప్రాంక్స్టర్ గా గుర్తింపు పొందారు.
ఇక మహ్వశ్ రేడియో జాకీగా కూడా పనిచేసారు. ఇలా కూడా మహ్వశ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె లక్షలాదిమంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఇలా సోషల్ మీడియా ఇన్ప్లుయెంజర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా వచ్చాయట.
స్వయంగా మహ్వశే సోషల్ మీడియాలో తాను ఫిల్మ్ ప్రొడ్యూసర్, యాక్టర్ గా పేర్కొంది. అయితే ఇప్పటివరకు ఆమె ఏ సినిమాలో నటించింది లేదు... కాబట్టి ఇప్పుడిప్పుడే ఆమెకు సినిమా అవకాశాలు వచ్చివుంటాయి. కానీ సినిమాలకంటే ముందే చాహల్ తో కనిపించి పెద్దపెద్ద హీరోయిన్లకు కూడా లేని ఫేమ్ మహ్వశ్ సంపాదించారు.