వన్డేల్లో ఇప్పటిదాకా సరైన ఒక్క ఇన్నింగ్స్ ఆడలేకపోయిన సూర్యకుమార్ యాదవ్, వన్డే వరల్డ్ కప్ 2023 జట్టులో చోటు దక్కించుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్‌కి బ్యాకప్ ప్లేయర్‌గా సూర్యను వరల్డ్ కప్‌కి ఎంపిక చేసింది బీసీసీఐ...
ఐపీఎల్‌లో గాయపడిన కెఎల్ రాహుల్, ఫిట్‌నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొంది... ఆసియా కప్ సూపర్ 4 మ్యాచుల కోసం శ్రీలంక చేరుకున్నాడు. నాలుగు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న కెఎల్ రాహుల్‌కి కూడా వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది..
Sanju and Chahal
రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లను వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి స్పిన్నర్లుగా సెలక్ట్ చేశారు సెలక్టర్లు. స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో లెగ్ స్పిన్నర్ లేకుండా బరిలో దిగుతోంది టీమిండియా...
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి టాప్ క్లాస్ టీమ్స్‌తో ఆడేటప్పుడు లెగ్ స్పిన్నర్ అవసరం చాలా ఉంటుంది. 2021 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో, 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో సరైన స్పిన్నర్ లేకపోవడం వల్లే 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది భారత జట్టు..
2011 వన్డే వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్‌ని వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఎంపిక చేయకపోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. అశ్విన్ లేకుండా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఆడి ఓడిన టీమిండియా, మరోసారి అతను లేకుండా బరిలో దిగడం చాలా పెద్ద రిస్క్ అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
Ravichandran Ashwin
శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్లను, వన్డేల్లో బాగా ఆడుతున్న సంజూ శాంసన్‌ని వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేయకపోవడంపై కూడా ట్రోల్స్ వినిపిస్తున్నాయి.
వన్డేల్లో 26 సగటుతో పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్‌ని వరల్డ్ కప్‌కి ఎంపిక చేసి, 55.71 సగటుతో పరుగులు చేసిన సంజూ శాంసన్‌ని పట్టించుకోకపోవడం అన్యాయమని మీమ్స్ వైరల్ చేస్తున్నారు అతని అభిమానులు..