ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కి చెందిన మల్‌గ్రేవ్ క్రికెట్ క్లబ్ తరుపున యువరాజ్ సింగ్‌తో పాటు వెస్టిండీస్ హిట్టర్ ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్, ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్ కూడా ఆడబోతున్నట్టు సమాచారం...
మెల్‌బోర్న్ ఈస్ట్నన్ క్రికెట్ అసోసియేషన్ (ఈసీఏ) మూడో సీజన్‌లో మల్‌గ్రేవ్ క్రికెట్ క్లబ్ తరుపున యువీతో పాటు ఏబీ డివిల్లియర్స్, క్రిస్ గేల్, బ్రియాన్ లారాలను ఆడించేందుకు చర్చలు పూర్తి అయ్యాయని తెలిపాడు ఆ క్లబ్ ప్రెసిడెంట్ మిలాన్ పులెనయెగం..
ఇప్పటికే మల్‌గ్రేవ్ క్రికెట్ క్లబ్ తరుపున శ్రీలంక మాజీ స్టార్లు తిలకరత్నే దిల్షాన్, ఉపుల్ తరంగా బరిలో దిగుతున్నారు. ఈ జట్టుకి శ్రీలంక మాజీ లెజెండ్ సనత్ జయసూర్య హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు...
‘ఇప్పటికే దిల్షాన్, జయసూర్య, తరంగలతో ఒప్పందాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు మరికొంత మంది స్టార్లను జట్టులోకి తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నాం.
యువరాజ్, క్రిస్ గేల్, మా జట్టు తరుపున ఆడడం 85 నుంచి 90 శాతం ఫిక్స్ అయినట్టే’ అని తెలిపాడు మల్‌గ్రేవ్ క్లబ్ ప్రెసిడెంట్...
అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత గ్లోబల్ టీ20 లీగ్, టీ10 లీగుల్లో పాల్గొన్నాడు యువరాజ్ సింగ్. ఈ కారణంగానే రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని యువీ భావించినా, ఫారిన్ లీగుల్లో పాల్గొన్న కారణంగా బీసీసీఐ, అతని వినతిని అంగీకరించలేదు.
ఈ ఏడాది ఆరంభంలో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో టీమిండియా లెజెండ్స్ తరుపున రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్న యువీ, వరుస సిక్సర్లతో మోత మోగించాడు.