ఇలా అయితే టీమిండియాకి కష్టమే, ఒక్క టెస్టు సరిపోదు... మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కామెంట్...

Published : Jun 07, 2021, 11:55 AM IST

రెండేళ్ల పాటు సాగిన సుదీర్ఘ ఐసీసీ టోర్నమెంట్ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ తుది మెట్టుకి చేరుకుంది. జూన్ 18 నుంచి ప్రారంభమయ్యే ఫైనల్‌లో గెలిచిన జట్టే, మొట్టమొదటి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ వేదికగా నిలుస్తుంది. అయితే మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, ఈ టోర్నీ నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు...

PREV
19
ఇలా అయితే టీమిండియాకి కష్టమే, ఒక్క టెస్టు సరిపోదు... మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కామెంట్...

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇప్పటికే సౌంతిప్టన్ చేరుకున్న భారత జట్టు, మూడు రోజుల క్వారంటైన్‌లో గడుపుతూనే ప్రాక్టీస్ చేస్తోంది. జూన్ 18 నుంచి ప్రారంభమయ్యే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఒక రిజర్వు డేని కూడా ఏర్పాటుచేసింది ఐసీసీ.

29

‘ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో బెస్ట్ ఆఫ్ త్రీ మ్యాచులు ఉండి ఉంటే బాగుండేది. ఎందుకంటే మొదటి మ్యాచ్ ఓడినా, తర్వాతి రెండు మ్యాచుల్లో కమ్‌బ్యాక్ ఇవ్వడానికి అవకాశం ఉండేది....

39

ఎందుకంటే న్యూజిలాండ్‌తో పోలిస్తే ఇప్పుడు భారత జట్టుకి పెద్దగా ప్రాక్టీస్ లేదు. న్యూజిలాండ్ జట్టు, అక్కడే ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడి ఫైనల్‌కి వస్తోంది... వారికి మంచి ప్రాక్టీస్ ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు కూడా చేస్తారు...

49

8 నుంచి 10 ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. సబ్‌స్టిట్యూట్ లేకుండా మ్యాచ్ ప్రాక్టీస్ జరుగుతుంది. ఎలా చూసుకున్నా న్యూజిలాండ్‌కి విజయావకాశాలు పెరుగుతాయి...’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.

59

‘లేటుగా వచ్చినంత మాత్రాన భారత జట్టు బలహీనమైనదేమీ కాదు. వాళ్లు ఆస్ట్రేలియా టూర్‌లో అదరగొట్టారు. ఎక్కడైనా గెలవగలమనే నమ్మకం, ధీమా భారత జట్టులో కనిపిస్తోంది...

69

అయితే ఇంగ్లాండ్ పరిస్థితులు, అక్కడి పిచ్ కండీషన్స్ పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటాయి. అదీకాకుండా అక్కడ డ్యూట్స్ క్రికెట్ బాల్ వాడతారు. దాంతో మనకి పెద్దగా అలవాటు కూడా లేదు...’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు యువీ.

79

ఇంగ్లాండ్‌లో టెస్టు క్రికెట్ ఆడిన అనుభవం లేని భారత ఓపెనర్లు యువరాజ్ సింగ్, శుబ్‌మన్ గిల్ రాణిస్తే... భారత జట్టు అవకాశాలు మెరుగవుతాయని, అయితే సాధ్యమైనంత త్వరగా వాళ్లు అక్కడి పిచ్‌పై అవగాహన ఏర్పరచుకుని ఫైనల్‌కి ప్రిపేర్ అవ్వాలని చెప్పాడు యువరాజ్.

89

2014లో రోహిత్ శర్మ టెస్టులు ఆడినా, మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చి పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. అయితే 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌లో ఏకంగా ఐదు సెంచరీలు చేసి రికార్డు క్రియేట్ చేశాడు యువరాజ్ సింగ్. ఓపెనర్‌గా రోహిత్ శర్మకు ఇదే తొలి ఇంగ్లాండ్ టూర్...

99

భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఒకే ఒక్క మ్యాచ్‌తో ఫైనల్ విజేతను తేల్చేయడం సరికాదని, మూడు మ్యాచులు పెట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయపడిన విషయం తెలిసిందే..

click me!

Recommended Stories