ఇంగ్లాండ్ క్రికెటర్ ఓల్లీ రాబిన్‌సన్‌పై బ్యాన్ వేసిన ఈసీబీ... 8 ఏళ్ల క్రితం నాటి ట్వీట్ల కారణంగా...

First Published Jun 7, 2021, 10:41 AM IST

తెలియక చేసినా, తెలిసి చేసినా తప్పు తప్పే. ఇది క్రికెట్‌లో కూడా వర్తిస్తుంది. తెల్ల తోలు చూసుకుని, కళ్లు మూసుకుపోయి 8 ఏళ్ల క్రితం చేసిన ట్వీట్ల కారణంగా ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు ఇంగ్లాండ్ క్రికెటర్ ఓల్లీ రాబిన్‌సన్. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో ఆరంగ్రేటం చేసిన రాబిన్‌సన్, మొదటి మ్యాచ్‌ తర్వాత నిషేధానికి గురయ్యాడు. 

న్యూజిలాండ్ తరుపున ఎంట్రీ ఇచ్చిన డివాన్ కాన్వే, ఆరంగ్రేటం టెస్టులో డబుల్ సెంచరీ చేసి అదరగొడితే, ఇంగ్లాండ్ తరుపున ఎంట్రీ ఇచ్చిన ఓల్లీ రాబిన్‌సన్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ రాణించి 101 బంతుల్లో 42 పరుగులు చేశాడు.
undefined
అయితే మొదటి మ్యాచ్ తర్వాత అతనిపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఓల్లీ రాబిన్‌సన్. దీనికి కారణం 8 ఏళ్ల క్రితం అతను ట్విట్టర్‌లో రాసిన కొన్ని జాతి వివక్ష, లింగ వివక్ష వ్యాఖ్యలే...
undefined
27 ఏళ్ల ఓల్లీ రాబిన్‌సన్‌ లార్డ్స్‌ క్రికెట్ స్టేడియంలో ఎంట్రీ ఇస్తూ... మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయితే అతను కొన్ని పాత ట్వీట్లు వైరల్ కావడంతో అతనిపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ మొదలైంది...
undefined
‘నేను ఆసియా జనాలు ఇలాంటి స్టైల్సీ పెడితే ఆశ్చర్యపోతుంటా...’, ‘వీడియో గేమ్స్ ఆడే అమ్మాయిలు సెక్స్ చేసేందుకు బాగా ఇష్టపడతారు. మిగిలినవారితో పోలిస్తే వీళ్లు రిలేషన్‌షిప్‌లో ఉండడాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు...’, ‘అబద్దాలు ఆడడం ఓ ఆర్ట్. అది చాలా మంది అమ్మాయిలకు బాగా తెలిసిన విద్య’, ‘నా కొత్త ముస్లిం ఫ్రెండ్ ఓ బాంబ్’... ఇవి రాబిన్‌సన్ వేసిన ట్వీట్లలో కొన్ని...
undefined
ఇవే కాదు, నల్లజాతీయులు, ఆసియా వాసులను నల్ల పందులుగా పోలుస్తూ, వారిపై పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేశాడు రాబిన్‌సన్. మహిళల గురించి అయితే వారు కేవలం సెక్స్ కోసం పుట్టారన్నకుంటా ట్వీట్లు చేశాడు...
undefined
తెల్లజాతీయుడననే జాత్యాహంకారం, వర్ణ వివక్ష, మహిళల చులకన భావం, సెక్సిజం వ్యాఖ్యలు అతని ట్వీట్లలో స్పష్టంగా కనిపించాయి. అయితే ఈ ట్వీట్లపై తాజాగా స్పందించాడు ఓల్లీ రాబిన్‌సన్.
undefined
‘ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజు. ఇలాంటి రోజున నా పాత ట్వీట్ల కారణంగా విమర్శలు ఎదుర్కోవడం సిగ్గుగా ఉంది. అవి నేను 8 ఏళ్ల క్రితం పోస్టు చేసిన ట్వీట్లు. ఇప్పుడు అవి పాపులర్ అవుతున్నాయి... నేను అప్పటి మనిషిని కాదు, చాలా మారిపోయాను. నేను రేసిస్టుని కాదు, సెక్సిస్టుని కూడా కాదు. నా ట్వీట్ల కారణంగా ఇబ్బందిపడిన ప్రతీ ఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు ఓల్లీ రాబిన్‌సన్.
undefined
అయితే 8 ఏళ్ల క్రితం రాబిన్‌సన్ వేసిన ట్వీట్లు వైరల్ కావడంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హారిన్‌సన్ ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు. రాబిన్‌సన్‌ను అంతర్జాతీయ క్రికెట్‌‌లో అన్ని ఫార్మాట్ల నుంచి తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, అతని ట్వీట్లపై విచారణ చేస్తున్నట్టు తెలిపింది.
undefined
రాబిన్‌సన్‌పై నిషేధం విధించడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అతను ట్వీట్లు చేసినప్పుడు శిక్ష విధించకుండా వదిలేసి, 8 ఏళ్ల తర్వాత బ్యాన్ విధించడం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు. 18 ఏళ్ల వయసులో అతను చేసిన ట్వీట్లకీ, ఇప్పుడు అతని ఆటకీ లింకు పెట్టడం సరికాదని... అతను క్షమాపణలు చెప్పినా దాన్ని లాగుతున్నారని వాదిస్తున్నారు.
undefined
ఇంకొందరు ఓల్లీ రాబిన్‌సన్‌ను శిక్షించడమే సరైన చర్య అని... ఇలా చేయడం వల్ల అంతర్జాతీయ క్రికెట్‌లో జాతి వివక్ష, వర్ణ వివక్ష, లింగ వివక్ష చూపించేవారికి ఇది గుణపాఠంగా మారుతుందని అంటున్నారు. రాబిన్‌సన్‌ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించడం వల్ల భవిష్యత్తులో జట్టులోకి వచ్చే క్రికెటర్లు కూడా ఇలాంటి ఆలోచనలు చేయడానికి భయపడతారని చెబుతున్నారు.
undefined
click me!