రిటైర్మెంట్ ప్రకటించిన పార్థివ్ పటేల్... ఆ వరల్డ్‌కప్ ఆడిన వారిలో మిగిలింది భజ్జీ ఒక్కటే..

First Published Dec 9, 2020, 2:10 PM IST

టీమిండియా వికెట్ కీపర్, ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ తర్వాత అతి పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన రెండో భారతీయ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన పార్థివ్ పటేల్... క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు పార్థివ్ పటేల్. 35 ఏళ్ల పార్థివ్ పటేల్.. టీమిండియా తరుపున 25 టెస్టు మ్యాచులు, 38 వన్డేలు, రెండు టీ20 మ్యాచులు ఆడాడు. 

జనవరి 4, 2002లో న్యూజిలాండ్‌పై అంతర్జాతీయ వన్డే ఎంట్రీ ఇచ్చిన పార్థివ్ పటేల్... ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు...
undefined
17 ఏళ్ల 152 రోజుల వయసులో టెస్టు క్రికెట్‌లో ఆరంగ్రేటం చేసిన పార్థివ్ పటేల్... టెస్టు క్రికెట్ ఆడని యంగెస్ట్ క్రికెటర్‌గా నిలిచాడు..
undefined
వన్డేల్లో నాలుగు హాఫ్ సెంచరీలు, టెస్టుల్లో ఆరు అర్థ శతకాలు బాదిన పార్థివ్ పటేల్... మొత్తంగా అంతర్జాతీయ కెరీర్‌లో 1706 పరుగులు చేశాడు...
undefined
వికెట్ కీపింగ్‌లో 93 క్యాచులు అందుకున్న పార్థివ్ పటేల్... 19 స్టంపింగ్‌లు చేశాడు...
undefined
12 సీజన్ల పాటు బ్రేక్ లేకుండా ఐపీఎల్ ఆడిన పార్థివ్ పటేల్‌కి ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. అతని స్థానంలో యంగ్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్‌కి అవకాశమిచ్చాడు విరాట్ కోహ్లీ...
undefined
2008లో చెన్నై తరుపున ఆరంగ్రేటం చేసిన పార్థివ్ పటేల్, 2015, 2017 సీజన్లలో ముంబై ఇండియన్స్ తరుపున ఫైనల్ మ్యాచుల్లో పాల్గొన్నాడు..
undefined
విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్ అని కామెంట్ చేసిన పార్థివ్ పటేల్, కొద్దిరోజులకే క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం విశేషం...
undefined
పార్థివ్ పటేల్ రిటైర్మెంట్‌తో 2003 వన్డే వరల్డ్‌కప్ ఆడిన జట్టులో ఒక్క హర్భజన్ సింగ్ మినహా మిగిలిన ప్లేయర్లు అందరూ రిటైర్ అయ్యినట్టు అయ్యింది.
undefined
రంజీ ట్రోఫీ, విజయ్ హాజరే ట్రోఫీ, సయ్యద్ ముస్తక్ ఆలీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, దేవ్‌దర్ ట్రోఫీ వంటి దేశవాళీ టోర్నీలన్నీ గెలిచిన పార్థివ్ పటేల్, ఐపీఎల్ గెలిచిన ముంబై జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు.
undefined
రిటైర్మెంట్ ప్రకటించిన పార్థివ్ పటేల్‌కి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.
undefined
click me!