రూ.5 బస్సు టికెట్ కొనలేని స్థితి నుంచి ఎయిర్‌బస్ ఎక్కేదాకా... నటరాజన్ తల్లి ఏం చెప్పిందంటే...

First Published Dec 9, 2020, 1:49 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో మెరిసిన యువ కిషోరం నటరాజన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపన ఆడిన నటరాజన్, ఐపీఎల్‌లో యార్కర్లతో అదరగొట్టి, టీమిండియాలో ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చాడు. ముందు ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లతో అదరగొట్టిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఆసీస్ టూర్‌కి ఎంపిక చేసిన సెలక్టర్లు, అతను గాయపడడంతో నటరాజన్‌కి అవకాశం ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాడు ఈ యంగ్ సెన్సేషన్. 

నవ్‌దీప్ సైనీ ఫెయిల్ అవ్వడంతో అతని స్థానంలో వన్డే జట్టులో ఎంట్రీ ఇచ్చిన నటరాజన్... మొదట వన్డేలో రెండు వికెట్లు తీసి అదరగొట్టాడు...
undefined
టీ20 సిరీస్‌లో స్టార్ పర్ఫామెన్సర్‌గా గుర్తింపు దక్కించుకున్న నటరాజన్... మూడు మ్యాచుల్లో కలిపి ఆరు వికెట్లు తీశాడు.
undefined
ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బుమ్రా రికార్డును సమం చేశాడు నటరాజన్...
undefined
2016లో ఆస్ట్రేలియాపై ఎంట్రీ ఇచ్చిన బుమ్రా, తన మొదటి టీ20 సిరీస్‌లో ఆరు వికెట్లు తీయగా, నటరాజన్ కూడా తన మొట్టమొదటి సిరీస్‌లో ఆరే వికెట్లు తీశాడు.
undefined
నిజానికి నటరాజన్ ప్రదర్శన కంటే వికెట్ తీసిన తర్వాత ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేకుండా కూల్‌గా నవ్వే నట్టూ యాక్షన్ జనాలను మెప్పించింది...
undefined
టీ20 సిరీస్‌లో అదరగొట్టిన నటరాజన్‌ను మెచ్చుకుంటూ పోస్టు చేశాడు సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్... పాక్ క్రికెటర్లతో సహా సచిన్ లాంటి లెజెండరీ క్రికెటర్లు కూడా నటరాజన్‌కి అభిమానులుగా మారిపోతున్నామంటూ కామెంట్ చేశారు.
undefined
దీనిపై వివరించిన నటరాజన్... ‘నేను చిన్నతనం నుంచి ఇంతే. వికెట్ తీసిన తర్వాత ఆవేశంగా అరవడం నాకు తెలీదు. బలమైన జట్టుపై నా ప్రదర్శన సంతృప్తినిచ్చింది...’ అని చెప్పుకొచ్చాడు.
undefined
బస్సు ఎక్కేందుకు రూ.5 లేని పరిస్థితి నుంచి ఆస్ట్రేలియాలో సిరీస్ ఆడేందుకు ఎయిర్ బస్ ఎక్కేదాకా ఎగిరిన నటరాజన్ ప్రస్థానంపై సగర్వంగా చెప్పుకొచ్చింది అతని తల్లి.
undefined
తమిళనాడులో చిన్నప్పంపట్టి గ్రామంలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది నటరాజన్ తల్లి, తండ్రి ఓ కూలీ...
undefined
నటరాజన్ తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం. ఐదుగురిలో పెద్దవాడైన నటరాజన్... అనేక కష్టాలను ఎదుర్కొని చదువు పూర్తిచేశాడు...
undefined
15 ఏళ్లు వచ్చేదాకా సరైన తిండి కూడా కష్టపడ్డాడట నటరాజన్...ఇంటర్మీడియన్ వరకూ చదివిన నట్టూ... బస్సు ఎక్కేందుకు ఐదు రూపాయలు లేక నడిచి వెల్లేవాడట.
undefined
అతని స్నేహితుడు జయప్రకాశ్ గైడెన్స్ కారణంగా బౌలింగ్‌పై దృష్టి సారించిన నటరాజన్... ఇప్పుడు భారత జట్టుకి ఆడే స్థాయికి ఎదిగాడు.
undefined
కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయడానికి ఒక్కరూ ముందుకు రాలేదని, ఇప్పుడు నటరాజన్ అలా ఆడుతున్నాడు.... ఇలా ఆడుతున్నాడు... ఇంకా బాగా బౌలింగ్ చేస్తే బాగుంటుందని అనేక మంది సలహాలు ఇస్తున్నారని చెబుతోంది నటరాజన్ తల్లి శాంతా నటరాజన్.
undefined
click me!