శుబ్‌మన్ గిల్... ఫ్యూచర్ హీరో ఆఫ్ ఇండియన్ టెస్ట్ క్రికెట్... గిల్ ఆటకి సీనియర్లు ఫిదా...

First Published Jan 19, 2021, 11:04 AM IST

శుబ్‌మన్ గిల్... దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి, టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన భారత యంగ్ క్రికెటర్. మొదటి టెస్టులో పృథ్వీషా ఘోరంగా విఫలం కావడంతో అతని స్థానంలో రెండో టెస్టులో చోటు దక్కించుకున్నాడు శుబ్‌మన్ గిల్. ఆసీస్‌కు లక్కీ స్టేడియంగా పేరొందిన గబ్బాలో నాలుగో ఇన్నింగ్స్‌లో అదిరిపోయే బ్యాటింగ్‌తో 91 పరుగులు చేసిన గిల్‌ని క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం ముంచెత్తుతోంది.

రోహిత్ శర్మ త్వరగా అవుటైనా, మరోవైపు ఛతేశ్వర్ పూజారా టెస్టు ఇన్నింగ్స్‌తో బంతులన్నీ ఆపేస్తున్నా... తనదైన స్టైల్‌లో పరుగులు చేశాడు శుబ్‌మన్ గిల్...
undefined
146 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్... సెంచరీకి 9 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు...
undefined
అతి పిన్న వయసులో ఆస్ట్రేలియాలో 90+ స్కోరు చేసి అవుటైన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన శుబ్‌మన్ గిల్.. 6 ఇన్నింగ్స్‌ల్లో 259 పరుగులు చేశాడు.
undefined
రోహిత్ శర్మ లాంటి సీనియర్ ఓపెనర్లు, ఆస్ట్రేలియా బౌలింగ్‌లో ఎదుర్కోవడానికి ఇబ్బందిపడిన చోట రెండు హాఫ్ సెంచరీలు చేసి ఔరా అనిపించాడు శుబ్‌మన్ గిల్...
undefined
51.8 సగటుతో మొట్టమొదటి టెస్టు సిరీస్‌లో పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌ను ‘ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ టెస్ట్ క్రికెట్’ అంటూ విశ్లేషిస్తున్నారు క్రికెట్ మాజీలు...
undefined
‘గిల్ ఈజ్ ఫ్యూచర్. అది కచ్ఛితంగా చెప్పగలను. అతన్ని రెగ్యూలర్‌గా క్రికెట్ ఆడించాల్సిన బాధ్యత సెలక్టర్ల మీదే ఉంది... అన్ని ఫార్మాట్లలోనూ అతను మంచిగా ఆడుతున్నాడు...’ అని ట్వీట్ చేశాడు ఆకాశ్ చోప్రా...
undefined
‘ఈరోజు శుబ్‌మన్ గిల్ ఆడిన విధానం చూస్తే అతను సెంచరీకి అన్ని విధాలా అర్హుడు. అతను భవిష్యత్తులో ఎన్నో సెంచరీలు సాధిస్తాడు... అమేజింగ్ టాలెంట్, మరీ ముఖ్యంగా ఒత్తిడిలో ఎలా బ్యాటింగ్ చేయడానికి కావాల్సిన మానసిక దృఢత్వం అతనికి ఉంది...’ అంటూ వీవీఎస్ లక్ష్మణ్ కితాబు ఇచ్చాడు.
undefined
‘శుబ్‌మన్ గిల్ ఓ సీరియస్ ప్లేయర్’ అంటూ ఇంగ్లాండ్ క్రికెట్ సామ్ బిల్లింగ్స్ కామెంట్ చేశాడు...
undefined
‘గిల్ ఓ జెమ్ ప్లేయర్... అతని ఆటతో అందర్నీ టెస్టు క్రికెట్ చూసేలా చేస్తాడు...’ అంటూ కామెంటేటర్ హర్షా భోగ్లే కామెంట్ చేశారు...
undefined
‘శుబ్‌మన్ గిల్... ఇదే నా ట్వీట్’ అంటూ గిల్ ఇన్నింగ్స్‌కి అభినందనలు తెలిపాడు వెస్టిండీస్ క్రికెటర్ బ్రాత్‌వైట్...
undefined
‘ఆస్ట్రేలియన్లు వికెట్లు తీయడానికి అన్నీ చేస్తున్నారు. కానీ గిల్ మాత్రం వారి మాట అస్సలు వినడం లేదు... ’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.
undefined
‘శుబ్‌మన్ గిల్ ఈ సిరీస్‌లో దొరికిన మంచి ప్లేయర్. అతనితో ఎవ్వరైనా సెడ్జింగ్ చేయాలని చూస్తే అతని క్లీన్ స్కిన్ బ్యాటుతో సమాధానం చెబుతున్నాడు... ’ అంటూ క్రికెట్ కామెంటేటర్ మెలిందా ఫర్రెల్ ట్వీట్ చేసింది.
undefined
‘నాకు తెలిసి శుబ్‌మన్ గిల్‌ ఎక్కువ రోజు బ్లాక్ బ్యాటుతో బ్యాటింగ్ చేయడనుకుంటా’ అంటూ క్రికెటర్ జిమ్మీ నీషమ్ ట్వీట్ చేశాడు...
undefined
click me!