విరాట్ కోహ్లీ ఆడిన షాట్ ఏంటో అతన్నే అడగండి! హాఫ్ సెంచరీ కోసమే ఇదంతా.. - సునీల్ గవాస్కర్

Published : Jun 12, 2023, 02:24 PM IST

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆఖరి రోజు 280 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టింది టీమిండియా. పిచ్ బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలిస్తుండడం, క్రీజులో విరాట్ కోహ్లీ ఉండడంతో టీమిండియా ఫ్యాన్స్ విజయంపై ఆశలు పెట్టుకున్నారు...

PREV
18
విరాట్ కోహ్లీ ఆడిన షాట్ ఏంటో అతన్నే అడగండి! హాఫ్ సెంచరీ కోసమే ఇదంతా.. - సునీల్ గవాస్కర్

ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో అజింకా రహానేతో కలిసి 86 పరుగుల భాగస్వామ్యం జోడించి అవుట్ అయ్యాడు. 78 బంతుల్లో 7 ఫోర్లతో 49 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని అవుట్ చేసిన బోలాండ్, అదే ఓవర్‌లో రవీంద్ర జడేజాని డకౌట్ చేశాడు..
 

28
Virat Kohli

‘ఒకే సెషన్‌లో 7 వికెట్లు పడడం అంటే అది కచ్ఛితంగా మనోళ్ల చేతకాని తనమే. మరీ ఇలా ఆడతారని మాత్రం అస్సలు అనుకోలేదు. చాలామంది బ్యాటర్లు చెత్త షాట్లు ఆడే అవుట్ అయ్యారు.

38
Rohit and Pujara

ఛతేశ్వర్ పూజారా ఏదో వింత షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 100 టెస్టులు ఆడిన పూజారా, అలాంటి షాట్ ఆడతారని ఎవ్వరూ ఊహించరు..

48

స్ట్రైయిక్ రేట్ తక్కువగా ఉందని, కొట్టాల్సిన స్కోరు ఎక్కువగా ఉందని అతని బుర్రలో తిరుగుతూ ఉండి ఉంటుంది. అందుకే అలాంటి షాట్ ఆడాడు. కనీసం పూర్తిగా ఒక్క సెషన్ కూడా ముగియకుండానే టీమిండియా ఆలౌట్ అయిపోయిందంటే మనోళ్లు ఎలా ఆడారో అర్థం చేసుకోవచ్చు...

58

విరాట్ కోహ్లీ అయితే మరీ చెత్త షాట్ ఆడాడు. ఆఫ్ సైడ్‌కి దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి మరీ కొట్టాల్సిన అవసరం ఏముంది? చాలా సార్లు ఆ బంతులను వదిలేశాడు. హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్నా, ఎలాగైనా ఆ మైలురాయిని అందుకోవాలనే ఆలోచనతోనే కోహ్లీ ఇలా ఆడి ఉంటాడు..

68

విరాట్ కోహ్లీ ఏ షాట్ ఆడాడో అతన్నే అడగండి. పనికి రాని హాఫ్ సెంచరీ కోసమేనా ఇదంతా. జడేజా కూడా అంతే. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 48 పరుగుల వద్ద ఉన్నప్పుడు షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. అజింకా రహానే కూడా 46 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు...

78

అప్పటిదాకా అజింకా రహానే చాలా ఏకాగ్రతగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించాడు. సడెన్‌గా అలాంటి షాట్ ఆడాల్సిన అవసరం ఏముంది. హాఫ్ సెంచరీ దగ్గర ఉన్నా అనేగా...

88
Rahane and Kohli

విరాట్ కోహ్లీ ఆడింది కచ్ఛితంగా బ్యాడ్ షాట్. కావాలంటే అతన్నే అడగండి. మ్యాచ్ గెలవాలంటే సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలి. ఇలాంటి షాట్స్ ఆడాల్సిన అవసరం లేదు. ఈ విషయం విరాట్ కోహ్లీకి తెలీదా...’ అంటూ ఫైర్ అయ్యాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్..

Read more Photos on
click me!

Recommended Stories