విరాట్ వల్లే నా కెరీర్ నాశనమైంది! జహీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు... ఆ రోజు మెక్‌కల్లమ్ క్యాచ్ పట్టి ఉంటే...

Published : Jul 26, 2023, 10:35 AM IST

టీమిండియా తరుపున 92 టెస్టులు ఆడిన జహీర్ ఖాన్, 311 వికెట్లు తీశాడు. 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లో కీ ప్లేయర్‌గా ఉన్న జహీర్ ఖాన్, 100 టెస్టులు ఆడిన భారత ఫాస్ట్ బౌలర్‌గా నిలిచే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కెరీర్ చివర్లో టీమ్‌లో చోటు కోల్పోయి, కఠిన పరిస్థితులను ఫేస్ చేశాడు జహీర్ ఖాన్..

PREV
18
విరాట్ వల్లే నా కెరీర్ నాశనమైంది! జహీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు... ఆ రోజు మెక్‌కల్లమ్ క్యాచ్ పట్టి ఉంటే...

వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కి ఇషాంత్ శర్మతో కలిసి కామెంటేటర్‌గా వ్యవహరించాడు జహీర్ ఖాన్. యాదృచ్ఛికంగా జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ ఇద్దరూ కూడా టెస్టుల్లో 311 వికెట్లు తీశారు. ఇద్దరూ టెస్టుల్లో 11 సార్లు ఐదేసి వికెట్లు, ఓ సారి 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేశారు. అంతేకాకుండా స్వదేశంలో, విదేశాల్లో తీసిన వికెట్ల సంఖ్య కూడా సేమ్ టూ సేమ్...

28

‘2014లో న్యూజిలాండ్ టూర్‌కి వెళ్లాం. ఆ మ్యాచ్‌లో బ్రెండన్ మెక్‌కల్లమ్ 300 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేశాడు. రెండో రోజు లంచ్ సమయంలో విరాట్ వెళ్లి, జహీర్‌కి క్యాచ్ డ్రాప్ చేసినందుకు సారీ చెప్పాడు...
 

38

అప్పుడు జాక్ (జహీర్), ‘‘ఏం పర్లేదు, మనం అతన్ని అవుట్ చేసేస్తాం’’ అన్నాడు. ఆ తర్వాత టీ బ్రేక్ సమయంలో మళ్లీ విరాట్, జాక్‌కి సారీ చెప్పాడు. ‘‘బాధపడకు... అవుట్ అవుతాడులే’’ అన్నాడు. మూడో రోజు టీ బ్రేక్ సమయంలో మళ్లీ వెళ్లి, జాక్‌కి సారీ చెప్పాడు విరాట్ కోహ్లీ..

48

ఈ సారి జహీర్ భాయ్, ‘‘నువ్వు నా కెరీర్‌ని ఫినిష్ చేసేశావు’’ అన్నాడు. ఆ మాటలకు విరాట్ షాక్ అయ్యాడు. ఆ క్యాచ్ డ్రాప్ చేసినందుకు విరాట్ కోహ్లీ చాలా ఫీల్ అయ్యాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు ఇషాంత్ శర్మ..

58

‘నేను, విరాట్‌తో అలా అనలేదు, కానీ నాకు తెలిసి కేవలం ఇద్దరు ప్లేయర్లు మాత్రమే క్యాచ్ డ్రాప్ చేయడం వల్లే ప్రత్యర్థి బ్యాటర్‌కి 300 ఇచ్చేశారు. కిరణ్ మోరే క్యాచ్ డ్రాప్ చేస్తే, గ్రాహం గూచ్ 300 కొట్టాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేస్తే, బ్రెండన్ మెక్‌కల్లమ్ 300 కొట్టేశాడు..

68

దానికి విరాట్ కోహ్లీ, అలా మాట్లాడవద్దని అన్నాడు. ఆ రోజు క్యాచ్ డ్రాప్ చేసినందుకు విరాట్ కోహ్లీ చాలా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే తాను డ్రాప్ చేసిన క్యాచ్, మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది... ’ అంటూ కామెంట్ చేశాడు జహీర్ ఖాన్..

78
zaheer khan

2014లో న్యూజిలాండ్‌ పర్యటనలో జరిగిన రెండో టెస్టులో బ్రెండన్ మెక్‌కల్లమ్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ని విరాట్ కోహ్లీ జారవిడిచాడు. ఆ సమయంలో మెక్‌కల్లమ్ స్కోరు 9 పరుగులు మాత్రమే.

88

ఆ తర్వాత భారత్‌కి అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ చేసిన మెక్‌కల్లమ్‌, 302 పరుగులు చేసి మొదటి త్రిబుల్ సెంచరీ నమోదు చేశాడు.. అతని ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ 680/8 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.  302 పరుగులు చేసిన మెక్‌కల్లమ్‌ని జహీర్ ఖాన్ అవుట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకి భారీ ఆధిక్యం దక్కినా రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 

Read more Photos on
click me!

Recommended Stories