యశ్ ధుల్ మరో పృథ్వీషా అవుతాడా... అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన ఇద్దరు కెప్టెన్ల మధ్య...

Published : Feb 19, 2022, 07:01 PM IST

అండర్ 19 వరల్డ్ కప్ 2022 టోర్నీని గెలిచి అందరి దృష్టినీ ఆకర్షించాడు యశ్ ధుల్. అండర్ 19 ఆసియా కప్, అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన యశ్ ధుల్‌కీ, 2018లో అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన పృథ్వీషాకి మధ్య చాలా పోలికలు ఉండడం విశేషంగా మారింది...

PREV
110
యశ్ ధుల్ మరో పృథ్వీషా అవుతాడా... అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన ఇద్దరు కెప్టెన్ల మధ్య...

2018-19 కెప్టెన్‌గా ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్‌ గెలిచాడు పృథ్వీషా. 2022లో కెప్టెన్‌గా ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ గెలిచాడు యశ్ ధుల్...

210

రంజీ ట్రోఫీలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆరంగ్రేటం చేశాడు పృథ్వీషా... యశ్ ధుల్ కూడా తమిళనాడుతో మ్యాచ్‌ ద్వారానే రంజీ ట్రోఫీలో ఎంట్రీ ఇచ్చాడు...

310

తన మొదటి ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన పృథ్వీషా 175 బంతుల్లో 120 పరుగులు చేశాడు. యశ్ ధుల్ కూడా మొదటి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసి 150 బంతుల్లో 113 పరుగులు చేశాడు...
 

410

సెంచరీకి ముందు 99 పరుగుల వద్ద నో బాల్ వల్ల పృథ్వీషాకి లైఫ్ దక్కింది. యశ్ ధుల్‌కి కూడా 97 పరుగుల లైఫ్ దొరికింది. యశ్ ధుల్‌ నాటౌట్‌గా నిలవడానికి కూడా నో బాల్ కారణం...

510

పృథ్వీషా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ద్వారా ఐపీఎల్ ఎంట్రీ ఇవ్వగా యశ్ ధుల్‌ కూడా డీసీ తరుపునే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆరంగ్రేటం చేయబోతున్నారు... 

610

దీంతో యశ్ ధుల్, మరో పృథ్వీషా అవుతాడా? అని లెక్కలు వేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్... దూకుడైన బ్యాటింగ్‌తో మరో యంగ్ టాలెంటెడ్ ప్లేయర్‌గా రిజర్వు బెంచ్‌కే పరిమితమవుతాడా? అంటూ అంచనాలు కడుతున్నారు.

710

అండర్ 19 వరల్డ్ కప్‌లో సెంచరీ చేసిన మూడో భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు యశ్ ధుల్. ఇంతకుముందు విరాట్ కోహ్లీ, ఉన్ముక్త్ చంద్ ఈ ఫీట్ సాధించారు...

810

విరాట్ కోహ్లీ, అండర్ 19 వరల్డ్ కప్ 2008 తర్వాత భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చి, టీమిండియా కెప్టెన్‌గా, లెజెండరీ బ్యాటర్‌గా నిలిచాడు...

910

2012లో అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన ఉన్ముక్త్ చంద్ మాత్రం వచ్చిన క్రేజ్‌కు ఉప్పొంగిపోయి, వరుసగా ఫెయిల్ అవుతూ... భారత జట్టుకి ఎంపిక కాలేక, యూఎస్‌కే వలసెళ్లి పోయాడు...

1010

యశ్ ధుల్ మరో పృథ్వీషా, విరాట్ కోహ్లీ కాకపోయినా కనీసం ఉన్ముక్త్ చంద్‌లా ఉసురుమనిపించకపోతే చాలని అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్...

Read more Photos on
click me!

Recommended Stories