కోహ్లీ, పంత్‌లకు రెస్ట్... సంజూ శాంసన్‌కి పిలుపు... శ్రీలంకతో టీ20 సిరీస్‌కి జట్టు ఇదే..

Published : Feb 19, 2022, 06:17 PM IST

విండీస్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు, ఆ తర్వాత శ్రీలంకతో టీ20, టెస్టు సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సిరీస్‌లకు జట్లను ప్రకటించారు సెలక్టర్లు...

PREV
110
కోహ్లీ, పంత్‌లకు రెస్ట్... సంజూ శాంసన్‌కి పిలుపు...  శ్రీలంకతో టీ20 సిరీస్‌కి జట్టు ఇదే..

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ నుంచి వరుస సిరీస్‌లు ఆడుతున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి శ్రీలంకతో టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు సెలక్టర్లు...

210

అలాగే సౌతాఫ్రికా టూర్‌తో విండీస్ సిరీస్‌లోనూ పాల్గొన్న వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి కూడా శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌ ఆడడం లేదు...

310

అలాగే ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్, గాయం నుంచి కోలుకోని కెఎల్ రాహుల్, మహ్మద్ షమీలకు శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ నుంచి రెస్ట్ కల్పించింది బీసీసీఐ...

410

రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించే ఈ టీ20 సిరీస్‌కి జస్ప్రిత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఉంటాడు. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌లకు మరోసారి అవకాశం దక్కింది...

510

శ్రీలంక టూర్‌ తర్వాత కనిపించని భారత సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్, మరోసారి లంక సిరీస్ ద్వారా భారత జట్టులో కనిపించబోతున్నాడు...

610

శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహార్ ఆల్‌రౌండర్లు లంకతో టీ20 సిరీస్‌ ఆడబోతుంటే రవీంద్ర జడేజా రీఎంట్రీ ఇవ్వనున్నాడు..

710

అలాగే విండీస్‌తో సిరీస్‌లో ఆకట్టుకున్న స్పిన్నర్ రవి భిష్ణోయ్‌తో పాటు యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్ స్పిన్ బౌలింగ్ త్రయంగా ఎంపికయ్యారు..

810

మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్ ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని మోయనున్నారు...

910

శ్రీలంకతో టీ20 సిరీస్‌కి భారత జట్టు ఇది: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రిత్ బుమ్రా (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చాహాల్, రవి భిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్

1010

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రిత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కెఎస్ భరత్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, సౌరబ్ కుమార్

Read more Photos on
click me!

Recommended Stories