ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం: స్టార్ ప్లేయర్లను పట్టించుకోని ఫ్రాంఛైజీలు.. రిచా ఘోష్‌కి..

Published : Feb 13, 2023, 05:11 PM IST

మెన్స్ క్రికెట్‌కి ఉన్న క్రేజ్, మహిళా క్రికెట్‌కి ఉండదు. భారత మహిళా క్రికెట్ టీమ్‌లో ఉన్న ప్లేయర్ల పేర్లు కూడా చాలామందికి తెలియదు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ వేలంలో ఈ విషయం బట్టబయలు అవుతోంది. భారీ హిట్టర్లుగా పేరుపొందిన స్టార్ ప్లేయర్లకు డబ్ల్యూపీఎల్ 2023 వేలంలో నిరాశ ఎదురైంది...

PREV
19
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం:  స్టార్ ప్లేయర్లను పట్టించుకోని ఫ్రాంఛైజీలు.. రిచా ఘోష్‌కి..
Heather Knight

అన్నాబెల్ సూథర్‌లాండ్‌ని రూ.70 లక్షలకు కొనుగోలు చేసింది గుజరాత్ జెయింట్స్... ఇంగ్లాండ్ కెప్టెన్ హేథర్ నైట్‌, సౌతాఫ్రికా ప్లేయర్ సునీ లూజ్‌ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు...

29
Harleen Deol

ఇంగ్లాండ్ బ్యాటర్ డానీ వ్యాట్‌, శ్రీలంక ఆల్‌రౌండర్ ఛమేరీ ఆటపట్టు‌ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు. భారత్ ఆల్‌రౌండర్ హర్లీన్ డియోల్‌ని బేస్ ప్రైజ్ రూ.40 లక్షలకు కొనుగోలు చేసింది గుజరాత్ జెయింట్స్..

39
Image credit: PTI

భారత ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌ని కొనుగోలు చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ జట్లు పోటీపడ్డాయి. రూ.1 కోటి 90 లక్షలకు పూజా వస్త్రాకర్‌ని ముంబై ఇండియన్స్ జట్లు కొనుగోలు చేసింది..

49

 వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్‌ని గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి. రూ.60 లక్షలకు డియాండ్రా డాటిన్‌ని కొనుగోలు చేసింది గుజరాత్ జెయింట్స్..

59
Taniya Bhatia

భారత సీనియర్ వికెట్ కీపర్ తానియా భాటియాని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు. శ్రీలంక వికెట్ కీపర్ అనుష్క సంజీవని కూడా అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరిపోయింది...

69

భారత యంగ్ వికెట్ కీపర్ యష్తికా భాటియాని కొనుగోలు చేయడానికి ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ పోటీపడ్డాయి... రూ.1 కోటి 50 లక్షలకు యష్తికా భాటియాని కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్...  యంగ్ వికెట్ కీపర్, అండర్19 టీ20 వరల్డ్ కప్ విన్నర్ రిచా ఘోష్ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి...

79
Image credit: Getty

రిచా ఘోష్‌ని రూ.1 కోటి 90 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఆలీసా హిలీని రూ.70 లక్షలకు కొనుగోలు చేసింది యూపీ వారియర్స్.. 
 

89

అంజలి సర్వాణీని యూపీ వారియర్స్ రూ.55 లక్షలకు కొనుగోలు చేసింది. భారత సీనియర్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్‌ని బేస్ ప్రైజ్ రూ.40 లక్షలకు కొనుగోలు చేసింది యూపీ వారియర్స్.  భారత స్పిన్నర్ పూనమ్ యాదవ్‌ని కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ముందుకు రాలేదు...
 

99

ఫ్రాన్ జోనస్, అఫీ ఫ్లెంచర్, అలానా కింగ్, ఇనొక రణవీర, నాన్‌కులులికో మ్లాబా, సారా గ్లెన్, షకీరా సల్మాన్, అయబొంగ ఖాఖా, లియా తహుహు, జహనరా అలం, మేఘన్ స్కాట్, ఫెయ డేవిస్, షెమిలియా కార్నెల్, అమీ జోన్స్, బెర్నాడైన్ బెచుడెన్, సుష్మా వర్మ వంటి స్టార్ ప్లేయర్లను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు.. 

 

click me!

Recommended Stories