ఆష్లీ గార్డనర్ సునామీ ఇన్నింగ్స్.. వరుసగా సిక్సర్ల మోత
గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ ఆష్లీ గార్డనర్ సునామీ ఇన్నింగ్స్ తో దంచికొట్టారు. వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మరీ ముఖ్యంగా ఆష్లీ గార్డనర్ అద్భుతమైన సిక్సర్లతో స్టేడియం హోరెత్తింది. ఆష్లీ గార్డనర్ కేవలం 39 బంతుల్లోనే 79 పరుగులతో చివరి వరకు నాటౌట్ గా ఉన్నారు.
తన 79 పరుగుల ఇన్నింగ్స్ తో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో దంచి కొట్టారు. తన ఇన్నింగ్స్ కారణంగా గుజరాత్ జెయింట్స్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముందు భారీ టార్గెట్ ను ఉంచింది.
స్మృతి మంధాన నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఛేజింగ్ ఆరంభంలోనే షాక్ తగిలింది. మంచి టచ్ లో ఉన్న కెప్టెన్ మంధాన (9 పరుగులు) రెండో ఓవర్ లోనే తన వికెట్ ను కోల్పోయింది. అదే ఓవర్ లో డానీ కూడా ఔట్ అయ్యారు. దీంతో 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆర్సీబీ.