Babar Azam: కింగ్ ను కాదంటూనే కోహ్లీకి షాకిచ్చాడు !

Published : Feb 14, 2025, 06:27 PM IST

Babar Azam: పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం రికార్డుల మోత మోగిస్తున్నాడు. న్యూజిలాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. 

PREV
15
Babar Azam: కింగ్ ను కాదంటూనే కోహ్లీకి షాకిచ్చాడు !

Babar azam beats Virat kohli: తాను కింగ్ ను కాదంటూనే భార‌త స్టార్ ప్లేయ‌ర్ కింగ్ కోహ్లీకి షాకిచ్చాడు పాకిస్తాన్ స్టార్ బ్యాట‌ర్ బాబర్ ఆజం. వ‌న్డే క్రికెట్ లో మ‌రో మైలురాయిని అందుకుంటూ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. కేవ‌లం విరాట్ కోహ్లీని మాత్ర‌మే కాదు న్యూజిలాండ్ స్టార్ ప్లేయ‌ర్ కేన్ విలియ‌మ్స‌న్, ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ల‌ను ఆడే ఆసీస్ బ్యాట‌ర్ డేవిడ్ వార్న‌ర్ ను కూడా వెనక్కి నెట్టాడు. 

25

వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా బాబర్ అజామ్ 

బాబర్ ఆజం వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగుల మైలురాయిని దాటిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. శుక్రవారం కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన ట్రై-సిరీస్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ కుడిచేతి వాటం ప్లేయ‌ర్ ఈ ఘనత సాధించాడు. జాకబ్ డఫీ వేసిన స్లో బాల్‌ను బాబర్ ఆజం ఫోర్ కొట్టి ఈ మైలురాయిని చేరుకున్నాడు. 

35
Image Credit: Getty Images

హషీమ్ ఆమ్లా రికార్డు స‌మం చేసిన బాబర్ ఆజం

వ‌న్డేల్లో అత్యంత వేగంగా 6000 ప‌రుగుల మార్కును అందుకున్నాడు పాకిస్తాన్ స్టార్ బాబ‌ర్ ఆజం. అత‌ను ఇప్పుడు దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లాతో కలిసి 6,000 వన్డే పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి ఇద్దరు ప్లేయ‌ర్లు 123 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు.

విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన బాబార్ ఆజం

భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ రికార్డును బాబ‌ర్ ఆజం బ్రేక్ చేశాడు. భారత ఆటగాడు విరాట్ కోహ్లీ 6,000 వన్డే పరుగులు చేయడానికి 136 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ చెరో 139 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. బాబార్ ఆజం కేవ‌లం 123 ఇన్నింగ్స్ ల‌లోనే 6వేల ప‌రుగులు పూర్తి చేశాడు. 

45

తొలి ఆసియా క్రికెట‌ర్ గా బాబర్ ఆజం రికార్డు

బాబార్ ఆజం  వ‌న్డేల్లో 6000 ప‌రుగులు పూర్తి చేయ‌డానికి 123 ఇన్నింగ్స్ ల‌ను తీసుకున్నాడు. దీంతో బాబర్ ఆజం ఇప్పుడు వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న తొలి ఆసియా వ్యక్తిగా నిలిచాడు.

న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో బాబర్ ఆజం పరుగుల కోసం చాలా ఇబ్బంది పడ్డాడు. ఫైనల్‌కు ముందు గత రెండు మ్యాచ్‌లలో 10 ప‌రుగులు, 23 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇక ఫైనల్లో, బాబర్ ఆజం మంచి ఆరంభం ఇచ్చాడు కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 34 బంతుల్లో 29 పరుగులు చేసి పెవిలియ‌న్ కు చేరాడు. బాబార్ ఆజం చివరిసారిగా 2023లో నేపాల్‌పై సెంచరీ చేశాడు. అప్ప‌టి నుంచి వ‌న్డేల్లో అత‌ను మూడు అంకెల స్కోర్ ను అందుకోలేదు.

55

న‌న్ను కింగ్ అని పిల‌వ‌కండి :  బాబార్ ఆజం 

ఈ మ్యాచ్ కు ముందు బాబార్ ఆజం మీడియాతో మాట్లాడుతూ.. త‌న‌ను "కింగ్" అని పిలవ‌ద్ద‌ని అన్నాడు. క్రికెట్ లో బాబర్ ఆజం సాధించిన రికార్డులు, గొప్ప ఇన్నింగ్స్ ల‌కు ప్రశంసగా అక్క‌డి మీడియా కింగ్ అంటూ పేర్కొంటుంది. అయితే, త‌న‌ను ఆలా పిలిపించుకోవ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని బాబార్ ఆజం చెప్పాడు. 

"దయచేసి నన్ను కింగ్ అని పిలవడం ఆపండి. నేను కింగ్ ను కాదు, నేను ఇంకా అక్క‌డికి చేర‌లేదు. ఇప్పుడు నాకు కొత్త రోల్స్ ఉన్నాయి. నేను ఇంతకు ముందు చేసినదంతా గతంలోనే.. ప్రతి మ్యాచ్ కొత్త సవాలు, నేను ప్ర‌స్తుతంతో పాటు రాబోయే కాలంపై దృష్టి పెట్టాలి" అని బాబర్ మీడియాతో అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories