T20 World Cup 2026: మా ప్లాన్ అదే.. ఆసీస్ క్లాస్ టీమ్.. మమ్మల్ని దెబ్బకొట్టారు.. ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ ఎమోషనల్ కామెంట్స్ !

Published : Jul 06, 2026, 07:56 AM IST

T20 World Cup 2026 Final: లార్డ్స్‌లో జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సూపర్ విక్టరీ తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్ ఫలితంపై, తమ జట్టు ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

PREV
14
ఆ సీనియర్ వల్లే కప్పు కొట్టాం.. వరల్డ్ కప్ గెలిచాక సీక్రెట్ లీక్ చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్

లార్డ్స్ లో జరిగిన ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్ ఏడోసారి ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అయితే, ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు మాట్లాడిన మాటలు ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. టోర్నీ అంతా అద్భుతంగా ఆడి ఫైనల్లో బోల్తా పడిన ఇంగ్లాండ్ కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ తీవ్ర నిరాశ వ్యక్తం చేయగా.. ఛాంపియన్ కెప్టెన్ సోఫీ మోలినెక్స్ భావోద్వేగానికి లోనైంది.

24
తీవ్ర నిరాశకు గురయ్యాం.. ఆసీస్ ఒక క్లాస్ టీమ్.. ఇంగ్లాండ్ కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్

ఫైనల్లో ఓటమి అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ తన మనసులోని బాధను పంచుకున్నారు. "ఈ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు మేము ఎంతో అద్భుతమైన క్రికెట్ ఆడాము, కానీ ఫైనల్ మ్యాచ్ ఇలా ముగుస్తుందని అస్సలు ఊహించలేదు. ఆస్ట్రేలియా నిజంగా ఒక క్లాస్ టీమ్. వారు తమకున్న అనుభవాన్ని ఉపయోగించి మమ్మల్ని పూర్తిగా అవుట్‌ప్లే చేశారు” అని అన్నారు.

34
మాకు అసలు ఛాన్స్ ఇవ్వలేదు, ఇబ్బంది పెట్టారు

అలాగే, “మా బ్యాటింగ్ ఇన్నింగ్స్ సమయంలో పిచ్‌పై సరైన లయ అందుకోవడం మాకు కష్టంగా మారింది. లార్డ్స్ పిచ్‌పై మేము కొద్దిగా పరుగులు తక్కువగా చేశామని భావిస్తున్నాను. ప్రెజర్ పెరిగిన ప్రతిసారీ ఆసీస్ బౌలర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి మాకు అసలు ఛాన్స్ ఇవ్వలేదు, ఇబ్బంది పెట్టారు. మా బౌలర్లు కూడా మ్యాచ్‌లో ఆలస్యంగా పుంజుకున్నారు. ముఖ్యంగా ఆసీస్ ఓపెనర్ బెత్ మూనీ ఒక క్లాస్ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకుంది. ఏదేమైనప్పటికీ, ఈ టోర్నీలో మా ప్లేయర్స్ చూపించిన పోరాటపటిమను చూసి నేను గర్వపడుతున్నాను" అని నాట్ సివర్ బ్రంట్ ఎమోషనల్ అయ్యారు.

44
ఇది ఒక కల.. ఆ సీనియర్లే మా గెలుపుకు కారణం.. ఆసీస్ కెప్టెన్ సోఫీ మోలినెక్స్

ప్రపంచకప్ ట్రోఫీని అందుకున్న అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ మోలినెక్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. "ఈ క్షణం నాకు నిజంగా ఒక కలలా అనిపిస్తోంది. ఈ మ్యాచ్ చూడటానికి మా నాన్న కూడా ఇక్కడికి రావడం నాకు చాలా స్పెషల్. ఈ ప్రపంచకప్ విజయం వెనుక మా జట్టు ఎంతో కృషి, కష్టం దాగున్నాయి. కేవలం ఒకరి కోసం ఒకరం ఆడాలనే బలమైన నిశ్చయంతో గత మూడు, నాలుగు నెలలుగా గ్రౌండ్‌లో విపరీతంగా కష్టపడ్డాము” అని అన్నారు.

“ఫైనల్ లాంటి హై-ప్రెజర్ మ్యాచ్‌లో ఒకరినొకరు నమ్ముకుని, మైదానంలో ప్రశాంతంగా ఆలోచించి ప్లాన్స్ అమలు చేశాము. మా జట్టులో ఉన్న ఎల్లీస్ పెర్రీ లాంటి సీనియర్ ప్లేయర్లు ఒత్తిడి సమయాల్లో జట్టును ఎంతో కూల్‌గా ఉంచారు, అది మాకు బాగా ప్లస్ అయింది. అలాగే లూసీ హామిల్టన్ లాంటి యంగ్ ప్లేయర్స్ కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీతో ఆడారు. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు కూడా అద్భుతంగా ఆడింది. మా సపోర్ట్ స్టాఫ్, ప్రపంచవ్యాప్తంగా మాకు సపోర్టు ఇచ్చిన అభిమానులకు, మా ఫ్యామిలీస్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు" అంటూ సోఫీ చెప్పుకొచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories