విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోతే టీమిండియా కూడా శ్రీలంకతో సమానం... పాక్ మాజీ కెప్టెన్ కామెంట్..

Published : Aug 11, 2023, 03:47 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఓడిన తర్వాత వెస్టిండీస్ పర్యటనకి వెళ్లింది భారత జట్టు. వరల్డ్ కప్‌కి అర్హత సాధించలేకపోయిన విండీస్‌ని మనవాళ్లు ఓ ఆటాడుకుంటారని అనుకున్నారు టీమిండియా ఫ్యాన్స్. అయితే సీన్ రివర్స్ అయ్యింది..  

PREV
18
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోతే టీమిండియా కూడా శ్రీలంకతో సమానం... పాక్ మాజీ కెప్టెన్ కామెంట్..

వన్డే వరల్డ్ కప్ 2023 క్వాలిఫైయర్స్‌లో జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ వంటి అసోసియేట్ దేశాలపై కూడా గెలవలేకపోయిన వెస్టిండీస్ చేతుల్లో ఓ వన్డే, మొదటి రెండు టీ20లు ఓడింది భారత జట్టు...

28

మొదటి వన్డే మ్యాచ్‌లో 115 పరుగుల లక్ష్యాన్ని కొట్టడానికి 5 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు మిగిలిన రెండు వన్డేల్లో రెస్ట్ ఇవ్వడం టీమ్‌పై తీవ్రంగా ప్రభావం చూపించింది.. విండీస్ టూర్‌లో మనవాళ్ల ఆటతీరు, భారత జట్టు భవిష్యత్తుపై అనుమానాలు రేగేలా చేసింది..
 

38
Image credit: PTI

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటే టీమిండియా పరిస్థితి ఏంటనే ప్రశ్నను లేవనెత్తుతోంది. తాజాగా పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ కూడా ఇదే రకమైన కామెంట్లు చేశాడు..

48

‘జస్ప్రిత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు లేకపోతే టీమిండియా కూడా శ్రీలంక జట్టుతో సమానం. ఎందుకంటే ఇన్నాళ్లు టీమిండియాని కాపాడుకుంటూ వస్తోంది ఈ ముగ్గురి అనుభవమే...
 

58
Rohit-Kohli Test

అనుభవం ఉన్న ఆటగాళ్లు లేకపోతే భారత జట్టు అయినా ఇబ్బంది పడక తప్పదని తేలిపోయింది. ఐపీఎల్ కారణంగా భారత జట్టు ప్లేయర్లతో మూడు టీమ్స్‌ని తయారుచేయొచ్చేమో. కానీ విజయాలు మాత్రం అందుకోలేరు...

68

rohit kohli dhawan

నేను, భారత ప్లేయర్లను తక్కువ చేసి మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇండియాలో చాలామంది సత్తా ఉన్న ప్లేయర్లు ఉన్నారు, క్వాలిటీ ప్లేయర్లు పుష్కలంగా ఉన్నారు. అయితే సీనియర్లు లేకపోతే టీమ్‌లో నాణ్యత తగ్గుతుంది. ప్రెషర్‌ని ఎలా ఫేస్ చేయాలో కుర్రాళ్లకు తెలీదు..

78

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ధోనీ వంటి సీనియర్లతో ఎంతో కాలం ఆడిన తర్వాత స్టార్ ప్లేయర్లుగా మారారు. ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే, ఫ్యూచర్ స్టార్లపై క్లారిటీ వస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్.. 

88

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో మొదటి రెండు మ్యాచుల్లో ఓడినా, మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుని కమ్‌బ్యాక్ ఇచ్చింది టీమిండియా. చివరి 2 మ్యాచుల్లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది భారత జట్టు.. 

Read more Photos on
click me!

Recommended Stories