వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కి హైప్ ఆకాశాన్ని తాకుతోంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో జరిగే ఈ మ్యాచ్‌ని స్టేడియంలో నేరుగా 1 లక్షమంది వీక్షించబోతున్నారు. ఈ మ్యాచ్, టీఆర్‌పీ రికార్డులు కూడా లేపేయడం ఖాయం..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 2న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అకీబ్ జావెద్...
26
‘టీమిండియాతో పోలిస్తే పాకిస్తాన్ జట్టు చాలా బ్యాలెన్స్‌డ్‌గా కనిపిస్తోంది. పాక్ ప్లేయర్ల వయసు గ్యాప్ చాలా బాగుంది. ఇండియాలో చాలామంది పెద్ద ప్లేయర్లు ఉన్నారు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా ఇలా చాలా అనుభవం ఉన్న ప్లేయర్లు ఉన్నారు..
36
అయితే ఎంతమంది ఉన్నా ఏమీ చేయలేరు, ఎందుకంటే కొందరికి ఫిట్‌నెస్ సరిగా లేదు, మరికొందరి ఫామ్ బాలేదు. అదీకాకుండా టీమ్ కాంబినేషన్ సెట్ కాక తెగ ఇబ్బందిపడుతున్నారు. ఈసారి ఇండియాలో ఇండియాపై గెలవడానికి, పాకిస్తాన్‌కి ఇదే అద్భుతమైన అవకాశం...
46
వైట్ బాల్ క్రికెట్‌లో జమాన్ ఖాన్ స్కిల్స్, పాక్ టీమ్‌కి బాగా ఉపయోగపడతాయి. కెనడా టీ20 లీగ్‌లో అతని బౌలింగ్ నన్ను ఆశ్చర్యపరిచింది. నా ఉద్దేశంలో జమాన్ ఖాన్, ఇప్పుడు ప్రస్తుత ఉన్న బెస్ట్ డెత్ బౌలర్లలో ఒకడు.
56
India vs Pakistan
షాహీన్, హారీస్ రౌఫ్, జమాన్ ఈ ముగ్గురూ వన్డే వరల్డ్ కప్‌లో ఆడితే అద్భుతాలు చేస్తారు. ఈ ముగ్గురి తర్వాత నసీం షా కూడా టీమ్‌కి బాగా ఉపయోగపడతాడు..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అకీబ్ జావెద్..
66
ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో 1992 వన్డే వరల్డ్ కప్ గెలిచిన పాక్ జట్టులో సభ్యుడిగా ఉన్న అకీబ్ జావెద్, పాక్ సూపర్ లీగ్‌లో ఓ టీమ్‌కి బౌలింగ్ కోచ్‌గా కూడా వ్యవహరించాడు.