టీమిండియా ఆల్‌టైం గ్రేట్ టీ20 జట్టును ప్రకటించిన విజ్డెన్... ఎంఎస్ ధోనీకి దక్కని చోటు...

First Published Oct 13, 2022, 11:40 AM IST

ఎలాంటి అంచనాలు లేకుండా మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 2007 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో అడుగుపెట్టి ఛాంపియన్‌గా నిలిచింది టీమిండియా. అలాగే మాహీ 2014 టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్‌, 2016 టోర్నీల్లోనూ సెమీస్ చేరింది. అయినా టీమిండియా ఆల్‌టైం టీ20 గ్రేట్ ప్లేయర్ల జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు ఎంఎస్ ధోనీ...

Image credit: PTI

విజ్డెన్ మ్యాగజైన్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు టీమిండియా ఆల్‌టైం మెన్స్ టీ20 ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించింది. ఇందులో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్న ప్రస్తుత సారథి రోహిత్ శర్మకు ఓపెనర్‌గా అవకాశం దక్కింది...

Image credit: PTI

రోహిత్ శర్మతో పోటీపడుతూ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచిన మాజీ సారథి విరాట్ కోహ్లీ మరో ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. ఈ ఇద్దరూ టీ20ల్లో అత్యధిక పరుగులు, అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డు కోసం హోరాహోరీగా పోటీపడుతున్న విషయం తెలిసిందే..

Latest Videos


Image credit: PTI

టీమిండియా తరుపున అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసినప్పటి నుంచి పరుగుల వరద పారిస్తున్న సెన్సేషనల్ సూర్యకుమార్ యాదవ్‌కి వన్‌డౌన్ ప్లేయర్‌గా విజ్డేన్ టీమ్‌లో చోటు దక్కింది. ఒకే ఏడాది టీ20ల్లో అంతర్జాతీయ పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్...

టీ20 వరల్డ్ కప్ 2007లో ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాది, టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కి విజ్డేన్ ఆల్‌టైం ప్లేయింగ్ ఎలెవన్‌లో టూ డౌన్ బ్యాటర్‌గా చోటు దక్కింది...

ఐపీఎల్ 2022 తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాతో పాటు మాజీ ఆల్‌రౌండర్, ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనాకి కూడా విజ్డేన్ ఆల్‌టైం గ్రేట్ టీ20 టీమ్‌లో మిడిల్ ఆర్డర్‌లో ప్లేస్ దక్కింది...

మూడేళ్ల తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి 37 ఏళ్ల వయసులో టీ20 వరల్డ్ కప్ 2022 ఆడబోతున్న సీనియర్ దినేశ్ కార్తీక్‌కి విజ్డేన్ ఆల్‌టైం ప్లేయింగ్ ఎలెవన్‌లో వికెట్ కీపర్‌గా చోటు దక్కింది. దినేశ్ కార్తీక్ తన 56 మ్యాచుల టీ20 కెరీర్‌లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ బాదడం విశేషం.

భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి విజ్డేన్ ఆల్‌టైం గ్రేట్ టీ20 టీమ్‌లో చోటు దక్కింది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ప్రకటించిన భారత జట్టులో అశ్విన్‌కి చోటు దక్కినా ప్రధాన స్పిన్నర్‌గా యజ్వేంద్ర చాహాల్ ఆడబోతున్నాడు. 54 టీ20ల్లో 72 వికెట్లు తీసిన చాహాల్ కంటే 51 టీ20 మ్యాచుల్లో 61 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్‌కి విజ్డేన్ టీమ్‌లో చోటు దక్కడం విశేషం. 

Bhuvi

భారత స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్‌కి విజ్డేన్ ఆల్‌టైం గ్రేట్ టీ20 టీమ్‌లో చోటు దక్కింది. 77 టీ20 మ్యాచుల్లో 84 వికెట్లు తీసిన భువీ, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియాకి కీలక బౌలర్‌గా మారాడు. 

Image credit: Getty

గాయం కారణంగా ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలకు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాకి కూడా విజ్డేన్ ఆల్‌టైం టీ20 టీమ్‌లో చోటు దక్కింది. టీమిండియా తరుపున 57 టీ20 మ్యాచులు ఆడిన బుమ్రా, 67 వికెట్లు తీశాడు..

గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్‌గా ఐపీఎల్ 2022 టైటిల్ నెగ్గిన భారత మాజీ బౌలర్ ఆశీష్ నెహ్రాకి ఆశ్చర్యకరంగా విజ్డేన్ ఆల్‌టైం టీ20 టీమ్‌లో చోటు దక్కింది. ఆశీష్ నెహ్రా తన కెరీర్‌లో కేవలం 27 అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడి 34 వికెట్లు తీయడం విశేషం.
 

ms dhoni

భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కి విజ్డేన్ టీమిండియా ఆల్‌టైం టీ20 ప్లేయింగ్ ఎలెవన్‌లో 12వ ప్లేయర్‌గా చోటు దక్కింది. అయితే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లకు ఆల్‌టైం ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది...

click me!