ఎలా గెలవాలో తెలుసుకున్నారు! వాళ్లను ఆపడం కష్టమే... టీమిండియాపై షోయబ్ అక్తర్ కామెంట్స్..

First Published | Sep 18, 2023, 2:09 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీకి ముందు టీమిండియా అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయితే అంచనాలకు మించి రాణించి, 8వ సారి టైటిల్ కైవసం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్‌ 2023 టోర్నీకి 20 రోజుల ముందు వచ్చిన ఈ విజయం, టీమ్‌పై పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందని అంటున్నాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్..

ఆసియా కప్ 2022 ఫైనల్‌కి కూడా అర్హత సాధించలేకపోయిన భారత జట్టు, ఈసారి సూపర్ 4 రౌండ్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచి ఫైనల్‌కి వచ్చింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది టీమిండియా..
 

Siraj

‘రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా మెరుగైంది. కీలక మ్యాచుల్లో ఈజీగా గెలవడానికి ఏం చేయాలో అతనికి, టీమ్ మేనేజ్‌మెంట్‌కి తెలిసింది. ఫైనల్‌లో భారత జట్టు ఇలా ఆడుతుందని అయితే నేను ఊహించలేదు..

Latest Videos


నేనే కాదు, నాకు తెలిసి ఎవ్వరూ టీమిండియా నుంచి ఇలాంటి పర్ఫామెన్స్ ఆశించి ఉండరు. ఈ విజయం, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీపై ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు వాళ్లను ఆపడం చాలా కష్టం...
 

అందులోనూ స్వదేశంలో ప్రపంచ కప్ ఆడుతున్నారు. ఫ్యాన్స్ సపోర్ట్ మొత్తం వారికే ఉంటుంది. అయితే ఇప్పుడు వారిపై పెరిగిపోయిన అంచనాలు, టీమిండియా ఆటతీరును ప్రభావితం చేయొచ్చు. సిరాజ్ బౌలింగ్ సూపర్బ్...

బౌలింగ్‌తోనే కాకుండా, తన ప్రైజ్‌మనీని గ్రౌండ్‌ స్టాఫ్‌కి ఇచ్చి చాలా గొప్ప పని చేశావు. వరల్డ్ కప్‌కి ముందు భారత జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ టోర్నీకి ముందు వరకూ నాకైతే భారత జట్టుపై పెద్దగా నమ్మకాలు లేవు..
 

Shoaib Akhtar

పాకిస్తాన్ ఈజీగా ఫైనల్ వెళ్తుందని అనుకున్నా. ఇప్పుడు పాక్‌తో మిగిలిన జట్లకు కూడా టీమిండియాతో కష్టమే. వరల్డ్ కప్‌కి రాబోతున్నామని ఘనంగా చాటుకున్నారు...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. 

click me!