వరల్డ్ కప్‌ 2023 ముందు అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టేనా? ఆసియా కప్ టోర్నీ గెలిచినా...

First Published | Sep 18, 2023, 12:44 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీకి ముందు టీమిండియాని ఎన్నో సమస్యలు, మరెన్నో చిక్కుముడులు వెంటాడాయి. భారీ అంచనాలతో బరిలో దిగిన పాకిస్తాన్, ఫైనల్‌ కూడా చేరలేకపోయింది. అయితే టీమిండియా అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి, 8వ సారి ఆసియా కప్ టైటిల్ కైవసం చేసుకుంది..

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు దక్కిన ఈ విజయం, టీమిండియాని వెంటాడుతున్న చాలా ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చేసింది. అయితే కొన్ని చిక్కుముడులు మాత్రం ఇంకా వీడలేదు..

గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన జస్ప్రిత్ బుమ్రా, కెఎల్ రాహుల్ అంచనాలకు తగ్గట్టుగా రాణించారు. బుమ్రా తన మార్క్ చూపిస్తూ మొదటి ఓవర్లలోనే వికెట్లు తీస్తే, పాక్‌తో సూపర్ 4 మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగాడు..
 

Latest Videos


అహ్మదాబాద్‌లో తప్ప బయట పరుగులు చేయలేడనే ముద్రను శుబ్‌మన్ గిల్ దాదాపు తొలగించేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాపార్డర్ ఫెయిల్ అయినా వీరోచిత సెంచరీతో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు శుబ్‌మన్ గిల్..

హార్ధిక్ పాండ్యా, బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. పాకిస్తాన్‌తో గ్రూప్ మ్యాచ్‌లో 87 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన హార్ధిక్ పాండ్యా, శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో 3 వికెట్లు పడగొట్టాడు..
 

Siraj

పాకిస్తాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో టాపార్డర్ బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అయినా మిడిల్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా పరుగులు చేయగలిగారు. బంగ్లాతో మ్యాచ్‌లో అక్షర్ పటేల్ ఆఖరి వరకూ పోరాడి, మ్యాచ్‌‌ని ఆఖరి ఓవర్ వరకూ తీసుకెళ్లగలిగాడు..

యజ్వేంద్ర చాహాల్‌ని పక్కనబెట్టి, కుల్దీప్ యాదవ్‌ని సెలక్ట్ చేయడం కరెక్టేనని నిరూపితమైంది. ఆసియా కప్ 2023 టోర్నీలో 9 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా గెలిచాడు.. 

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా బ్యాటింగ్‌లో రాణించారు. అయితే శ్రేయాస్ అయ్యర్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం భారత జట్టును ఇబ్బందిపెడుతోంది. ఇషాన్ కిషన్ మిడిల్ ఆర్డర్‌లో కుదురుకోవడంతో అయ్యర్ కోలుకోకపోయినా పెద్దగా సమస్య లేదు. కానీ అయ్యర్ ప్లేస్‌లో మరో ప్లేయర్‌ని ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది..
 

Jasprit Bumrah

కీ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చిన మ్యాచ్‌లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు. అయితే ఈ ఇద్దరి నుంచి ఆశించిన పర్ఫామెన్స్ రాలేదు. తిలక్ వర్మ, ఆసియా కప్ వరకే పరిమితమైతే సూర్య, వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్నాడు..

వన్డేల్లో చెప్పుకోదగ్గ ఒక్క ప్రదర్శన కూడా లేకుండా ప్రపంచ కప్ ఆడడానికి సిద్ధమవుతున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఏ ప్లేయర్ అయినా గాయపడినా, లేదా రెస్ట్ తీసుకుంటే సూర్యని వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లు ఆడించాల్సి రావచ్చు. అప్పుడు కూడా సూర్య ఫెయిల్ అయితే భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..

రవీంద్ర జడేజా బ్యాటుతో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. అక్షర్ పటేల్ అయితే అటు బ్యాటుతోనూ, ఇటు బౌలింగ్‌లోనూ అదరగొట్టే పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. బంగ్లాతో మ్యాచ్‌లో అక్షర్ గాయపడడం కూడా టీమ్‌కి కొత్త సమస్య కావచ్చు..
 

click me!