రోహిత్, ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచాడు! చాలామంది ఒక్కసారి కూడా గెలవలేదు... కోహ్లీని ట్రోల్ చేసిన గంభీర్..

First Published | Sep 18, 2023, 1:32 PM IST

ఐపీఎల్ సక్సెస్ కారణంగానే విరాట్ కోహ్లీని తప్పించి, రోహిత్ శర్మకు టీమిండియా వన్డే కెప్టెన్సీ అప్పగించింది బీసీసీఐ. భారత క్రికెట్ బోర్డు మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా ఈ విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించాడు. తాజాగా గంభీర్, ఇదే విషయాన్ని ప్రస్తావించి విరాట్ కోహ్లీని ట్రోల్ చేశాడు..
 

rohit kohli gambhir

ఆసియా కప్ 2023 ఫైనల్‌లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసి, టైటిల్ గెలిచింది టీమిండియా. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇది రెండో ఆసియా కప్. 2018లో తాత్కాలిక సారథిగా భారత జట్టుకి ఆసియా కప్ అందించాడు రోహిత్ శర్మ... 

‘రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి నాకెప్పుడూ అనుమానాలు లేవు. అతను ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచాడు. చాలామంది ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయారు. అయితే రోహిత్‌కి నిజమైన పరీక్ష వచ్చే 15 రోజుల్లో మొదలవుతుంది..


ఇప్పుడు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో బెస్ట్ 15-18 ప్లేయర్లు ఉన్నారు. వాళ్లతో వరల్డ్ కప్ గెలవలేకపోతే మాత్రం రోహిత్ కెప్టెన్సీపై అనుమానాలు రేగుతాయి. ప్రతీ వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్లు ఇలాంటివి ఎదుర్కొన్నారు..
 

విరాట్ కోహ్లీ కూడా దీన్ని ఫేస్ చేశాడు. రాహుల్ ద్రావిడ్ 2007 వరల్డ్ కప్ సమయంలో దీన్ని తీవ్రంగా ఎదుర్కొన్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఫెయిల్ అయితే, రోహిత్ కూడా ఆ ప్రభావాన్ని ఫేస్ చేయక తప్పదు..

అయితే ఈ టీమ్ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌కి వెళ్లగల సత్తా ఉన్న జట్టుగానే కనిపిస్తోంది. మిగిలిన దాంతా రోహిత్‌పైనే ఆధారపడి ఉంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...

ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవలేదని గౌతమ్ గంభీర్ చేసిన కామెంట్లు, విరాట్ కోహ్లీ గురించేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ టీమ్ ఫెయిల్ అయితే, కోహ్లీ ఫ్యాన్స్ నుంచి తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేయాల్సి ఉంటుంది.. 

Latest Videos

click me!