2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ ఎందుకు ఆడలేదు? అసలు సీక్రెట్ ఇదా...

Published : Aug 27, 2023, 03:58 PM IST

2003 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరిన భారత జట్టు, 2007 వన్డే వరల్డ్ కప్‌లో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగింది. ద్రావిడ్ కెప్టెన్సీలో ఆడిన 2007 వన్డే వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజీ కూడా దాటలేక, పరువు పోగొట్టుకుంది భారత జట్టు. ఈ పరాజయం తర్వాత 2007 టీ20 వరల్డ్ కప్‌కి సీనియర్లు దూరంగా ఉన్నారు..  

PREV
18
2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ ఎందుకు ఆడలేదు? అసలు సీక్రెట్ ఇదా...

రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, జహీర్ ఖాన్‌, అనిల్ కుంబ్లే వంటి సీనియర్లు లేకుండా మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 2007 టీ20 వరల్డ్ కప్ ఆడింది టీమిండియా... 
 

28
Virender Sehwag

ధోనీ టీమ్‌లో వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ వంటి అతికొద్ది మంది సీనియర్లు మాత్రమే టీ20 వరల్డ్ కప్ 2007 ఆడారు. అయితే ఫైనల్ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ ఆడకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది..

38

ఫైనల్‌లో పాకిస్తాన్‌ని 5 పరుగుల తేడాతో ఓడించి, మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా టీమిండియా రికార్డు క్రియేట్ చేసింది. భారత జట్టు గెలిచింది కాబట్టి ఫైనల్ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ ఆడలేదనే విషయం కూడా చాలా మందికి గుర్తు లేదు. రిజల్ట్ తేడా కొట్టి ఉంటే, ఫైనల్‌లో వీరూ ఆడకపోవడం పెద్ద హాట్ టాపిక్ అయ్యేది..

48

‘వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మిస్ అవ్వాలని ఏ ప్లేయర్ కూడా కోరుకోడు. అయితే అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నాకు గాయమైంది. పెయిన్ కిల్లర్ వేసుకున్నా, రకరకాల డ్రిల్స్ చేసి చూశా...

58

పూర్తిగా జ్వరం వచ్చేసింది. రేపు మ్యాచ్. రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎంతకీ నొప్పి తగ్గకపోవడంతో ధోనీ దగ్గరకి వెళ్లి, ఫైనల్ మ్యాచ్ ఆడలేనని చెప్పేశా. యూసఫ్ పఠాన్‌ని ఆడించమని చెప్పా. 

68

ఒకవేళ నేను టీ20 వరల్డ్ కప్ 2007 ఫైనల్ ఆడినా, నా ప్లేస్‌లో మరో ప్లేయర్‌ని ఫీల్డింగ్ చేయించాల్సి వచ్చేది. నా వల్ల ఫైనల్ ఓడిపోకూడదనే ఉద్దేశంతో ఆ మ్యాచ్ నుంచి తప్పుకున్నా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. 
 

78

2007 టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజీలో పాకిస్తాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో 9 పరుగులు చేసిన సెహ్వాగ్, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 11 పరుగులు చేశాడు. 

88

అంతకుముందు ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 68 పరుగులు చేసి రాణించాడు సెహ్వాగ్. వీరూ ప్లేస్‌లో 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన యూసఫ్ పఠాన్ 8 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్‌తో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బౌలింగ్‌లో ఓ ఓవర్ బౌలింగ్ చేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.  

Read more Photos on
click me!

Recommended Stories