విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్ కాదు.. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టాప్ స్కోరర్ అతనే! - వీరేంద్ర సెహ్వాగ్

Published : Aug 27, 2023, 01:36 PM IST

2023 వన్డే వరల్డ్ కప్‌లో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది భారత జట్టు. శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ బీభత్సమైన ఫామ్‌లో ఉన్నారు. జస్ప్రిత్ బుమ్రా రీఎంట్రీలోనే ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచాడు...

PREV
16
విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్ కాదు.. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టాప్ స్కోరర్ అతనే! - వీరేంద్ర సెహ్వాగ్
Image credit: PTI

కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ వంటి ఫాస్ట్ బౌలర్లు, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి స్పిన్నర్లతో ఆసియా కప్ 2023 టోర్నీలో బరిలో దిగుతోంది టీమిండియా..

26
Image credit: PTI

వన్డే వరల్డ్ కప్ టోర్నీలోనూ ఆసియా కప్ టీమ్‌నే ఎక్కువగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఆసియా కప్ 2023 కోసం 17 మందిని సెలక్ట్ చేయగా అందులో 15 మంది, వన్డే వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉంది..

36
Image credit: PTI

‘ఇండియాలో రోహిత్ శర్మకు అద్భుతమైన రికార్డు ఉంది. అతను సెటిల్ అయితే ఎలా ఆడతాడో అందరికీ తెలుసు. ఒక్కసారి రోహిత్ శర్మ ఊపు అందుకున్నాక అతన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు..

46

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో రోహిత్ శర్మ, టాప్ స్కోరర్‌ అవుతాడని నాకు అనిపిస్తోంది. భారత పిచ్‌ల మీద ఎలా బ్యాటింగ్ చేయాలో అతనికి బాగా తెలుసు. వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీలో ఎలా ఆడాడో చూశాం...

56

ఈసారి వన్డే వరల్డ్ కప్‌లోనూ రోహిత్ శర్మ ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇస్తాడని నాకు అనిపిస్తోంది. అదీకాకుండా ఈసారి అతను టీమిండియా కెప్టెన్ కూడా. ఈసారి మరింత జోష్‌తో పరుగులు చేస్తాడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..

66
Dawid Malan and Jos Buttler

‘నా ఉద్దేశంలో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో జోస్ బట్లర్ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడు. 2022 ఐపీఎల్‌లో అతను ఎలా ఆడాడో చూశాం. ఐపీఎల్ అనుభవం అతనికి వన్డే వరల్డ్ కప్‌లో కచ్ఛితంగా ఉపయోగపడుతుంది..’ అంటూ సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్ వ్యాఖ్యానించాడు.  

Read more Photos on
click me!

Recommended Stories