టీమిండియా ఓడిపోతుందని బండ బూతులు తిట్టాలని రెఢీగా వచ్చా... సునీల్ గవాస్కర్ కామెంట్స్..

First Published | Sep 18, 2023, 4:17 PM IST

ఆసియా కప్ 2023 టైటిల్‌ని భారత్ కైవసం చేసుకుంది. గత ఆసియా కప్‌లో ఫైనల్ కూడా చేరలేకపోయిన భారత జట్టు, ఈసారి టేబుల్ టాపర్‌గా ఫైనల్ చేరింది. శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో అద్వితీయ విజయంతో టైటిల్ సొంతం చేసుకుంది..
 

‘నిజానికి పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్‌కి ముందు ఇండియా- శ్రీలంక మ్యాచ్‌పై చాలా రకాల ట్రోల్స్ వచ్చాయి. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 213 పరుగులకే ఆలౌట్ కావడంతో ఓడిపోవడం ఖాయమని ఫిక్స్ అయ్యాం. ప్లేయర్లను బండ బూతులు తిట్టడానికి సిద్ధమై వచ్చాం..

అయితే ఆ మ్యాచ్ అద్భుతంగా గెలిచారు. ఆ మ్యాచ్‌లో టీమిండియా కావాలని ఓడిపోతుందని కొందరు పాక్ ఫ్యాన్స్ ట్రెండ్ చేశారు. అవి నా దాకా వచ్చాయి. ఇవన్నీ బుర్ర లేని వాళ్లు చేసే పనులు..

Latest Videos


అసలు భారత జట్టు కావాలని ఓడిపోవాలని ఎందుకు అనుకుంటుంది. ఒకవేళ భారత జట్టు, లంక చేతుల్లో ఓడిపోతే.. టీమిండియాకి చాలా కష్టమైపోయేది. పాకిస్తాన్, లంకను ఓడించి... భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే... టీమిండియా ఫైనల్‌కి కూడా వచ్చేది కాదు..
 

Kohli-Rohit

ఫైనల్‌లో శ్రీలంక అదరగొడుతుందని ఆశించా. అన్నింటికంటే ముఖ్యంగా పాకిస్తాన్ టీమ్, ఈ విధంగా సూపర్ 4 స్టేజీ నుంచి నిష్కమిస్తుందని అస్సలు ఊహించలేదు. వాళ్ల నుంచి టాప్ లెవెల్ పర్ఫామెన్స్ ఆశించాను..

ఇలాగే 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలోనూ జరిగింది. గ్రూప్ స్టేజీలో భారత జట్టు, ఇంగ్లాండ్ చేతుల్లో ఓడిపోయింది. ధోనీ, అండ్ టీమ్ కావాలని మెల్లిగా బ్యాటింగ్ చేశారని పాక్ ఫ్యాన్స్ ఆరోపించారు. ధోనీ టచ్‌లో ఉంటే ఎలా ఆడతాడో అందరికీ తెలుసు..

అయితే 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో ధోనీ ఫామ్‌లో లేడు. ఇంగ్లాండ్ బాగా ఆడి ఆ మ్యాచ్‌లో గెలిచింది. అయినా మీకు సరిగ్గా ఆడి, సెమీ ఫైనల్‌కి రాలేక మీరు కావాలని ఓడిపోతున్నారని మా మీద పడతారేంటి? 

ఆసియా కప్ గెలిచినంత మాత్రాన వరల్డ్ కప్ గెలిచేస్తామని కాదు. వరల్డ్ కప్‌లో మరింత కష్టపడాలి. మరింత బాగా ఆడాలి. మరీ ముఖ్యంగా ఒత్తిడిని ఫేస్ చేస్తూ రాణించాలి. నాకౌట్ స్టేజీలకు అర్హత సాధించడం భారత జట్టు చేతుల్లోనే ఉంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. 

click me!