డిసెంబర్‌లో ఐపీఎల్ 2022 మెగా వేలం... నలుగురు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం...

Published : Jul 05, 2021, 10:21 AM IST

ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు మెగా వేలం నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మెగా వేలానికి సంబంధించిన మార్గదర్శకాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి...

PREV
110
డిసెంబర్‌లో ఐపీఎల్ 2022 మెగా వేలం... నలుగురు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం...

ఐపీఎల్ 2021 సీజన్‌కి సంబంధించిన మిగిలిన మ్యాచులను సెప్టెంబర్‌లో యూఏఈ వేదికగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ...

210

సెప్టెంబర్ 19న ప్రారంభమై, అక్టోబర్ 10లోపు ఐపీఎల్ 2021 సీజన్‌లో 31 మ్యాచులను పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం...

310

అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్‌కప్ ఆరంభమవుతుంది. కాబట్టి ఈ మెగా టోర్నీకి ముందు భారత జట్టు ప్లేయర్లకు కావాల్సినంత విశ్రాంతి ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ.

410

ఐపీఎల్ 2022 సీజన్‌లో అదనంగా రెండు జట్లను చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ. వీటికి సంబంధించిన నామినేషన్లలకు సంబంధించిన త్వరలో నోటిఫికేషన్ కూడా రానుంది...

510

ఐపీఎల్ 2021 సీజన్ పార్ట్ 2 ఆరంభానికి ముందే అదనంగా చేరే రెండు జట్ల గురించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.

610

ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు మెగా వేలం నిర్వహించబోతోంది బీసీసీఐ. మెగా వేలానికి ముందు ప్రతీ ఫ్రాంఛైజీ కేవలం నలుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకునేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది...

710

ఇద్దరు విదేశీ, ఇద్దరు స్వదేశీ ప్లేయర్లు... లేదా ముగ్గురు స్వదేశీ, ఓ విదేశీ ప్లేయర్లను అట్టిపెట్టుకుని, మిగిలిన ప్లేయర్లను మెగా వేలానికి విడుదల చేయాల్సి ఉంటుంది...

810

అంటే ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రాలను స్వదేశీ ప్లేయర్ల కేటగిరీలో అట్టిపెట్టుకుంటే, కిరన్ పోలార్డ్, ట్రెంట్ బౌల్ట్‌లను విదేశీ ప్లేయర్ల లిస్టులో అట్టిపెట్టుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్ లేదా హర్ధిక్ పాండ్యాలలో ఒకరు కావాలనుకుంటే విదేశీ ప్లేయర్లలో ఒకరిని పక్కనబెట్టాల్సి ఉంటుంది...

910

ఇంతకుముందు వేలానికి విడుదల చేసిన ప్లేయర్లను, రైట్ టు మ్యాచ్ కార్డ్ (ఆర్‌టీఎం) కింద మెగా వేలంలో తిరిగి తీసుకునే అవకాశం ఉండేది. అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో దాన్ని తొలగించబోతున్నట్టు సమాచారం...

1010

డిసెంబర్ నెలలో మెగా వేలం నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ, షెడ్యూల్ ప్రకారం మార్చి నెలాఖరును ప్రారంభమయ్యే ఐపీఎల్ 2022 సీజన్ సమయానికి ముందు ఫ్రాంఛైజీలకు తగినంత సమయం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాయి.

click me!

Recommended Stories