ధోనీకి ఆఖరి సీజన్ అని ఎవరు చెప్పారు? అలాంటిదేం లేదు... ట్విస్ట్ ఇచ్చిన దీపక్ చాహార్...

First Published Mar 20, 2023, 10:05 AM IST

2020 సీజన్ నుంచి మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. 2020 సీజన్ సమయంలో సీఎస్‌కే ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ ప్లేయర్లు, ధోనీతో ఫోటోలు దిగడానికి అతని జెర్సీపై ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడానికి ఎగబడ్డారు...

ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత రిటైర్ తీసుకోబోతున్నారా? అనే ప్రశ్నకు ‘డెఫనెట్‌లీ నాట్’ అంటూ సమాధానం ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఆ తర్వాత ఐపీఎల్ 2021, ఐపీఎల్ 2022 సీజన్ల సమయంలోనూ ధోనీ రిటైర్మెంట్ గురించి వార్తలు వచ్చాయి..

ఎట్టకేలకు ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత ధోనీ రిటైర్ కాబోతున్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మాహీ ఫేర్‌వెల్ సీజన్ అంటూ ఐపీఎల్ 2023 టీవీ ప్రసార హక్కులు సొంతం చేసుకున్న స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ కూడా ప్రచారం చేస్తోంది...

అయితే చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చాహార్ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టి పారేశాడు. ‘ధోనీకి ఇదే ఆఖరి సీజన్ అని ఎవరు చెప్పారు? టీమ్‌లో ఎవ్వరూ కూడా ఇది మాహీ భాయ్ లాస్ట్ సీజన్ అని చెప్పలేదు. కనీసం మాహీ భాయ్ కూడా ఇలా చెప్పలేదు...

నాకు తెలిసి ధోనీ భాయ్ ఇంకా చాలా సీజన్లు ఆడతాడు. మాహీ భాయ్ ఇప్పటికీ చాలా ఫిట్‌గా ఉన్నాడు. ఈజీగా సిక్సర్లు బాదుతున్నాడు. ధోనీ రిటైర్ అవ్వబోతున్నాడని మాకు ఎలాంటి సమాచారం లేదు...  ఆయన చాలా సీజన్లు ఆడాలని కోరుకుంటున్నాం...

ధోనీకి ఎప్పుడు రిటైర్ కావాలో బాగా తెలుసు. టెస్టుల్లో ఎవ్వరూ ఊహించని టైమ్‌లో రిటైర్మెంట్ తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి కూడా అంతే.. ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడనేది ఎవ్వరూ ఊహించలేదు..
 

ఈసారి కూడా అలాంటి ట్విస్టే ఉంటుందేమో.. ఇలా అందరూ అనుకుంటున్నప్పుడు ధోనీ రిటైర్మెంట్ ఇవ్వడనే నమ్ముతున్నా.. ధోనీ కెప్టెన్సీలో ఆడడం నాకు దక్కిన గౌరవం, అదృష్టం...

ఎంతో మంది క్రికెటర్లు ధోనీ కెప్టెన్సీలో ఆడాలని కలలు కంటారు. నాకు చాలా తక్కువ వయసులోనే ఆ అదృష్టం దక్కింది. నెట్స్‌లో మాహీ భాయ్ చాలా బాగా ఆడుతున్నారు. ఈసారి ఆయన బ్యాటు నుంచి అద్భుతమైన షాట్స్ చూస్తారు.. ’ అంటూ కామెంట్ చేశాడు సీఎస్‌కే బౌలర్ దీపక్ చాహార్...

deepak chahar and dhoni

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ గురించి కొన్ని కామెంట్లు చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ.. ‘చెన్నైలో సొంత అభిమానుల మధ్య మ్యాచ్ ఆడకుండా రిటైర్ అవ్వడం న్యాయం కాదు. ముంబైలో నాకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే చెన్నైలో నా టీమ్ సొంత అభిమానుల మధ్య ఆఖరి మ్యాచ్ ఆడాలనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు మాహీ..

dhoni

ఐపీఎల్ 2019 తర్వాత మూడు సీజన్లు కరోనా ఆంక్షల కారణంగా చెన్నైలో సీఎస్‌కే మ్యాచులు జరగలేదు. నాలుగేళ్ల తర్వాత చెన్నై చెపాక్ స్టేడియంలో సొంత అభిమానుల మధ్య మ్యాచులు ఆడనుంది చెన్నై సూపర్ కింగ్స్.. 

click me!