PV Sindhu Marriage: డబుల్ ఒలింపిక్ మెడల్ విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ అయిన పీవీ సింధు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. స్టార్ షట్లర్ వివాహ వేడుకలు డిసెంబర్ 20 నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. వారం పాటు వారి ఇంట్లో పెళ్లి వేడుకలు జరగనున్నాయి. అయితే, పీవీ సింధుకు కాబోయే భర్త వెంకట్ దత్త సాయి ఎవరో మీకు తెలుసా?
పీవీ సింధు-వెంకట్ దత్త సాయి పెళ్లి
డబుల్ ఒలింపిక్ పతక విజేత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, పోసెడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయిని డిసెంబర్ 22న ఉదయపూర్‌లో వివాహం చేసుకోనున్నారు. ఆదివారం లక్నోలో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ లో సింధు చాలా కాలం తర్వాత ట్రోఫీని గెలుచుకున్న తర్వాత ఈ గుడ్ న్యూస్ అందించారు.
పీవీ సింధు పెళ్లి ఎప్పుడంటే?
పలు మీడియా నివేదికల ప్రకారం.. పీవీ సింధు వివాహ కార్యక్రమాలు డిసెంబర్ 20 న ప్రారంభమవుతాయి. రెండు కుటుంబాలు డిసెంబర్ 24 న హైదరాబాద్‌లో రిసెప్షన్ కూడా నిర్వహించనున్నాయి. "రెండు కుటుంబాలకు ఒకరికొకరు తెలుసు, కానీ ఒక నెల క్రితమే వివాహం ఫిక్స్ చేశారు. ఇది జనవరి నుండి ఆమె షెడ్యూల్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమయ్యే విండో ఇది మాత్రమే” అని సింధు తండ్రి పీవీ రమణ తెలిపినట్టు పీటీఐ నివేదించింది.
అందుకే డిసెంబర్ 22న పెళ్లి వేడుకలు నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. డిసెంబర్ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది. వచ్చే సీజన్‌కు ప్రాధాన్యత ఉండటంతో ఆమె తన శిక్షణను త్వరలో ప్రారంభించనుందని కూడా ఆయన తెలిపారు.
పీవీ సిధుకు కాబోయే భర్త వెంకట దత్త సాయి ఎవరు?
పీవీ సింధు వివాహం చేసుకోబోయే వ్యక్తి పేరు వెంకట దత్త సాయి. వెంకట దత్త సాయి ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ నుండి లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్/లిబరల్ స్టడీస్‌లో డిప్లొమా చేశారు. అతను 2018లో ఫ్లేమ్ యూనివర్శిటీ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుండి తన ఎంబీఏ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ పూర్తి చేసాడు. బెంగుళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసాడు.
2019 నుండి వెంకట దత్త సాయి పోసిడెక్స్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు సోర్ ఆపిల్ అసెట్ మేనేజ్‌మెంట్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇక భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు-వెంకట దత్త సాయి వివాహం ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరగనుంది. డిసెంబర్ 22న సింధు, వెంకట్ దత్త సాయిల వివాహం జరగనుంది. రిసెప్షన్ డిసెంబర్ 24న హైదరాబాద్‌లో జరగనుంది.
ఆదివారం సయ్యద్ మోదీ ఓపెన్‌లో విజయం సాధించడంతో చాలా కాలం తర్వాత టైటిల్ కరువును ముగించిన తర్వాత సింధు కుటుంబం నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. డిసెంబర్ 1న జరిగిన ఫైనల్లో చైనా క్రీడాకారిణి వు లుయో యును ఓడించి సింధు టైటిల్ గెలుచుకుంది. మరోవైపు లక్ష్య సేన్ కూడా తన విజయానికి తోడుగా నిలిచాడు. త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ పుల్లెల జోడీ కూడా మంచి ప్రదర్శన చేసి మహిళల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది.