సౌరవ్ గంగూలీ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే... 1999 వరల్డ్‌కప్‌లో రాహుల్ ద్రావిడ్‌తో కలిసి...

First Published May 26, 2021, 11:39 AM IST

భారత మాజీ సారథులు సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీలకు.. ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీకి ఓ విషయంలో పోలిక ఉంది. గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్‌ బెస్ట్ స్కోరు 183 పరుగులు కాగా ఇప్పటిదాకా విరాట్ కోహ్లీ హై స్కోరు కూడా సరిగ్గా ఇంతే. గంగూలీ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఒకటైన 183 పరుగుల ఇన్నింగ్స్‌కి నేటికి సరిగ్గా 22 ఏళ్లు.

మే 26, 1999లో శ్రీలంకపై 183 పరుగుల భారీ స్కోరు నమోదుచేశాడు సౌరవ్ గంగూలీ. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 1999 వన్డే వరల్డ్‌కప్‌లో నమోదైందీ రికార్డు ఫీట్. గంగూలీకి తోడుగా రాహుల్ ద్రావిడ్ కూడా 145 పరుగులతో అదరగొట్టాడు.
undefined
టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ అర్జున రణతుంగ, భారత జట్టుకి బ్యాటింగ్ అప్పగించాడు. గంగూలీతో పాటు ఓపనర్‌గా వచ్చిన సదాగొప్పన్ రమేశ్ 5 పరుగులకే అవుట్ అయ్యాడు. 6 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా...
undefined
ఆ తర్వాత సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ కలిసి రెండో వికెట్‌కి 318 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డేల్లో నమోదైన మొట్టమొదటి 300+ భాగస్వామ్యం ఇదే. గంగూలీ 158 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లతో 183 పరుగులు చేశాడు.
undefined
స్లోగా బ్యాటింగ్ చేస్తాడని పేరున్న రాహుల్ ద్రావిడ్ కూడా ఈ మ్యాచ్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 129 బంతుల్లో 17 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 145 పరుగులు చేశాడు. 324 పరుగుల వద్ద రాహుల్ ద్రావిడ అవుట్ అయ్యాడు.
undefined
ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ 2, అజేయ్ జడేజా 5, రాబిన్ సింగ్ డకౌట్ కాగా అప్పటి కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 373 పరుగుల భారీ స్కోరు చేసింది టీమిండియా...
undefined
భారీ లక్ష్యచేధనలో అరవింద డి సిల్వ 56 పరుగులు, అర్జున రణతుంగ 42 పరుగులు చేసినా మిగిలిన బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించకపోవడంతో 42.3 ఓవర్లలో 216 పరుగులకి ఆలౌట్ అయ్యింది శ్రీలంక. భారత జట్టుకి 157 పరుగుల భారీ విజయం దక్కింది.
undefined
రాబిన్ సింగ్ 5 వికెట్లు తీయగా 1999 వన్డే వరల్డ్‌కప్‌లో ఈ మ్యాచ్‌కి ముందు కెన్యాపై సెంచరీ సాధించిన గంగూలీ, వరుసగా రెండో సెంచరీ బాదాడు. 119 బంతుల్లో సెంచరీ బాదిన గంగూలీ, ఆ తర్వాత 24 బంతుల్లో 50 పరుగులు రాబట్టాడు. 100 నుంచి 183 పరుగులకు చేరుకునేందుకు 39 బంతులే వాడుకున్నాడు గంగూలీ.
undefined
‘నాకు క్రికెట్‌పై ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఈ మ్యాచ్‌. గంగూలీ, రాహుల్ ద్రావిడ్ చేసిన ఇన్నింగ్స్ నాపై చాలా ప్రభావం చూపించాయి. వారిద్దరి ఇన్నింగ్స్ చూస్తూ, ప్రేక్షకులు కొట్టిన చప్పట్లు, అరుపులు, కేకలతో వారిచ్చిన ఉత్సాహం నన్ను క్రికెట్‌వైపు అడుగులు వేసేలా చేశాయి...’ అంటూ వ్యాఖ్యానించాడు ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్.
undefined
గ్రూప్ స్టేజ్‌లో 5కి ఐదు మ్యాచులు గెలిచి, టేబుల్ టాపర్‌గా నిలిచిన భారత జట్టు, సూపర్ 8 రౌండ్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో ఓడి, 1999 వన్డే వరల్డ్‌కప్ నుంచి నిష్కమించింది.
undefined
click me!