పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి ముందు జిమ్‌ చేస్తూ పడిపోయిన ధోనీ! పార్థివ్ పటేల్‌ని దించిన సెలక్టర్లు! తీరా చూస్తే...

First Published Jun 19, 2023, 1:23 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ... మాస్ ఫాలోయింగ్ విషయంలో ఏ క్రికెటర్ కూడా మాహీకి పోటీ రాలేడేమో.. టీమిండియా కెప్టెన్‌గా, చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్న ధోనీ... గాయాలతో బాధపడుతూనే టీమ్‌ని గెలిపించిన సందర్భాలు కోకొల్లలు...

dhoni injury

‘2016లో బంగ్లాదేశ్ టూర్‌కి మొదటిసారి చీఫ్ సెలక్టర్‌గా సెలక్ట్ అయ్యా. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే మీడియా వాళ్లంతా చుట్టి ముట్టి, ‘‘ధోనీ గురించి ఏం అనుకుంటున్నాడు? ఆడతాడా? లేదా?’’ అంటూ అడిగాడు. అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలీదు, వాళ్లకేం చెప్పాలి...

dhoni injury

అక్కడి నుంచి తప్పించుకుని టీమ్ హోటల్‌కి వెళ్లి రవిశాస్త్రిని కలిశాను. ఆయన్ని అడిగితే ధోనీ జిమ్ చేస్తున్నప్పుడు పడిపోయాడు, బ్యాక్ పట్టేసిందని చెప్పాడు. ఒక్కసారిగా నా గుండెలో రాయి పడ్డట్టు అనిపించింది..

Latest Videos


dhoni injury

సెలక్టర్‌గా నా మొదటి మ్యాచ్‌కి ముందే ఇలా జరిగిందేంటా? అని భయపడిపోయాను. వెళ్లి చూస్తే, ధోనీ ఇలా వెనక్కి పడుకుని ఉన్నాడు. డాక్టర్లు కూడా మాహీ నాలుగైదు వారాల పాటు లేచి నడవలేడని చెప్పేశారు..

Dhoni

ఏం చేద్దామో చెప్పమని రవిశాస్త్రిని అడిగాను. నువ్వు సెలక్టర్‌ని నన్ను అడుగుతున్నావేంటని ఆయన నాతో అన్నారు. అలా కాదు, నీ సలహా ఏంటని అడిగాను. అయితే సరే, బ్యాకప్‌గా పార్థివ్ పటేల్‌ని పిలిపించమని చెప్పాడు...

Dhoni

వెంటనే ఆ తర్వాతి రోజే పార్థివ్ పటేల్‌, బంగ్లాదేశ్‌లో దిగాడు. మాహీకి విషయం తెలిసి, ‘ఏంటి...  నీ పని నువ్వు చేస్తున్నావుగా! పార్థివ్‌ని దించావుగా’ అన్నాడు. ‘అవును, ధోనీ.. నువ్వేమో ఏ విషయం చెప్పడం లేదు. పాకిస్తాన్‌తో మ్యాచ్... ఆడతావా? లేదా’ అని మళ్లీ అడిగాను..

ఆయన సైలెంట్‌గా ‘కూల్...’ అంటూ వెళ్లిపోయాడు. ఆ తర్వాతి రోజు తన రూమ్‌‌కి వెళితే ధోనీ లేడు. వెళ్లి చూస్తే, స్విమ్మింగ్ ఫూల్‌లో నడుస్తున్నాడు... తన బ్యాక్‌కి రిలిఫ్ ఇవ్వడానికి సొంతంగా ట్రీట్‌మెంట్ చేసుకుంటున్నాడు. మ్యాచ్ ఆడే ఉద్దేశం ఉందని నాకు కాస్త మనసుకు రిలాక్స్ అనిపించింది...

ఆ తర్వాతి రోజు అందరికంటే ముందు టిఫిన్ చేయడానికి వచ్చాడు. ఇండియన్ జెర్సీ వేసుకున్నాడు. సాధారణంగా ఆ టైమ్‌లో ఎవ్వరూ జెర్సీ వేసుకోరు. అప్పుడు ఎలా ఉందని అడిగితే తాను వేసుకున్న షర్ట్ విప్పి చూపించాడు..
 

లోపల లెదర్ బెల్టులు వేసుకుని గట్టిగా కట్టుకుని ఉన్నాడు. ‘‘నిన్న గాక మొన్న సెలక్టర్‌గా వచ్చిన నీకే, పాకిస్తాన్‌తో మ్యాచ్ అనగానే అంత ఇది ఉంటే... ఇన్ని కోట్ల మంది నన్ను నమ్మి, నాపై నమ్మకం పెట్టుకున్నారు. నాకు ఈ మ్యాచ్‌ మీద ఎంత ఉండాలి...

ఇది కాదు కదా, ఈ కాలి తెగిపోయినా ఒక్క కాలుతో ఆడతా... ఇలాంటి చిన్న చిన్న గాయాలు నన్ను ఆపలేవు...’’ అన్నాడు. అన్నట్టుగానే బ్యాక్ పెయిన్‌ని భరిస్తూనే ఆడి మ్యాచ్‌ని గెలిపించాడు. 

అంతకుముందు 2013లో ఓసారి వాళ్ల ఇంటికి వెళ్లా. అప్పటికి ఇంకా చిన్న ఇంట్లోనే ఉంటున్నారు. రెండు మూడు గంటలైనా ఎవ్వరూ మాట్లాడడం లేదు. సాక్షియే అప్పుడప్పుడూ మాట్లాడుతోంది...

ఆ సైలెంట్ భరించలేక నేనే, ధోనీ వాళ్ల నాన్నని కదిలించా... మాహీ చిన్నప్పటి నుంచి ఇలాగే ఉండేవాడా? అని అడిగా. ఆయన... ‘చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడు. ఇప్పుడు ఇలాగే ఉంటున్నాడు. ఫ్యూచర్‌లోనే ఇలాగే ఉంటాడు..’ అని చెప్పాడు...

అది జరిగిన తర్వాత కొన్నేళ్లకు ఈ మధ్యలో రాంఛీలో తన ఇంటికి వెళ్లా. చాలా పెద్ద ఇళ్లు. అన్నీ అందంగా సర్ది ఉన్నాయి. మేం వెళ్లగానే నాకోసం ఛాయ్ తీసుకొచ్చారు. అప్పుడు కూడా అదే సైలెన్స్..
 

మా అందరికీ అందమైన, ఖరీదైన టీ కప్పుల్లో ఛాయ్ ఇస్తే... ధోనీ మాత్రం ఓ గాజు గ్లాస్‌లో తాగుతున్నాడు. నాకు ఆశ్చర్యమేసి అడిగా, ఎందుకని గాజు గ్లాస్‌లో తాగుతున్నావంటే... ఇందులో తాగితే నేను ఎక్కడి నుంచి వచ్చానో గుర్తుంటుంది? అని సమాధానం చెప్పాడు... ప్రతీ ఒక్కరికీ ఇది ఉండాలి... మన మూలాలు తెలిసి ఉండాలి, అప్పుడే మాహీలాంటి వ్యక్తిత్వం అలవడతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు బీసీసీఐ మాజీ సెలక్టర్, మాజీ వికెట్ కీపర్, కామెంటేటర్ ఎమ్మెస్కే ప్రసాద్..

click me!