Published : Jun 19, 2023, 12:07 PM ISTUpdated : Jun 19, 2023, 12:19 PM IST
సచిన్ టెండూల్కర్, ఎమ్మెస్ ధోనీ తర్వాత జనాల్లో ఆ రేంజ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. సోషల్ మీడియా ఫాలోయింగ్‌లో ప్రపంచంలోనే టాప్ క్రికెటర్. అయితే విరాట్ గురించి చాలా మందికి తెలియని విషయాలను బయటపెట్టాడు బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్....
‘విరాట్ కోహ్లీ అనగానే చాలా మంది అగ్రెసివ్ క్రికెటర్. చాలా కోపిష్టి అనుకుంటారు. అయితే క్రీజులో ఉండే కోహ్లీ వేరు, బయట అందరితో ఉండే కోహ్లీ వేరు. విరాట్ కోహ్లీకి బీభత్సమైన ఓసీడీ...
217
Image credit: PTI
రేపు ఏం వేసుకోవాలి? అని ఈరోజే నీట్‌గా రెఢీ చేసి పెట్టుకుంటాడు. షూస్ దగ్గర్నుంచి, ప్రతీదీ నీట్‌గా ఉండాల్సిందే. అతని రూమ్‌లో ప్రతీదీ ఎక్కడిది ఉండాల్సింది అక్కడే అన్నట్టుగా పర్ఫెక్ట్‌గా సర్ధి ఉంటాయి...
317
Virat Kohli
విరాట్ కోహ్లీకి ఇంత కోపం, కసి రావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఓ చిన్న కుటుంబం నుంచి వచ్చాడు. చిన్నతనంలో తన కుటుంబం ఇంటి రెంటు కూడా కట్టలేని పరిస్థితులను చూశాడు. అద్దె కట్టడం లేదని ఇంటి యజమాని వచ్చి గొడవ చేస్తుంటే చూసి తట్టుకోలేకపోయాడు..
417
Image credit: KCA
అప్పుడే నా తర్వాత 10 తరాలకు ఇలాంటి పరిస్థితి రాకూడదని ఫిక్స్ అయ్యాడు. అప్పటి నుంచే చనిపోయేవరకూ కష్టపడాలని అనుకున్నాడు. విరాట్‌ని రంజీ ప్లేయర్‌గా చూడాలని వాళ్ల నాన్న ఆశపడ్డాడు..
517
యాదృచ్ఛికమో, విధి సంకల్పమో ఏమో కానీ విరాట్ ఓ రంజీ మ్యాచ్ ఆడుతుండగానే తండ్రి చనిపోయాడనే వార్త వచ్చింది. బ్రేక్ టైమ్‌లో కోహ్లీకి ఈ విషయం చెప్పారు. అతని ప్లేస్‌లో ఎవ్వరైనా ఉంటే బ్యాటు పడేసి తండ్రిని చూసేందుకు వెళ్లిపోయేవాళ్లే...
617
Virat Kohli
విరాట్ మాత్రం నాన్న కోసం బ్యాటింగ్ చేయాలని అనుకున్నాడు. అందుకే బాధని భరిస్తూనే బ్యాటింగ్ చేసి, సెంచరీ కొట్టి ఇన్నింగ్స్ ముగిశాక తండ్రిని చూసేందుకు వెళ్లాడు.. విరాట్ కోహ్లీ ఎందుకు మిగిలిన ప్లేయర్ల కంటే స్పెషల్ అనేది ఆ టైమ్‌లోనే అర్థమవుతుంది.
717
Virat Kohli
అయితే కెప్టెన్‌గా అండర్19 వరల్డ్ కప్ గెలవడం, ఆ తర్వాత ఐపీఎల్, టీమిండియాకి ఆడడం... చిన్నతనంలోనే చూడాల్సిన సక్సెస్ అంతా చూసేశాడు. అందుకేనేమో 2011-12 వచ్చేసరికి చాలా రిలాక్స్ అయిపోయాడు.. పార్టీలు, లైట్ నైట్ జల్సాలు.. తెగ ఎంజాయ్ చేశాడు.
817
పేలవ ఫామ్‌తో ఇక విరాట్ కోహ్లీని తప్పించేద్దాం అనే టైమ్ వచ్చేసింది. అతన్ని కలిసినప్పుడు కూడా ఇదే అడిగా... ఏంది? ఇది... ఎలా ఉండేవాడివి? ఎలా అయిపోయావ్? బుగ్గలు వచ్చేశావ్? లావు అయిపోయావ్... అని...
917
Virat Kohli
అతను కూడా ఇదే మాట చెప్పాడు. నేను కెరీర్‌లో ఇంక చేయాల్సింది ఏమీ లేదనే నిరాశ నాలో నిండిపోయిందని బాధపడ్డాడు. అదే టైమ్‌లో శ్రీలంకతో మ్యాచ్ జరుగుతోంది. విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్‌లో కూడా ఫెయిల్ అయితే, అతన్ని పక్కనబెట్టేయాలని సెలక్టర్లు కూడా అనుకుంటున్నారు..
1017
ఆ మ్యాచ్‌లో శ్రీలంకపై 80 బాల్స్‌లో ఏమో 130 కొట్టాడు (86 బంతుల్లో 133 పరుగులు). ఆ ఇన్నింగ్స్ అతనికి, అతని కెరీర్‌కి టర్నింగ్ పాయింట్. ఇది కదా నేను, ఇలా కాదు నేను ఆడాల్సిందని గట్టిగా ఫిక్స్ అయ్యాడు...
1117
అప్పటికి టీమ్‌లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ లాంటి సీనియర్లు ఉన్నారు. వాళ్లలా తాను మారాలని అనుకున్నాడు. అలా మారాలంటే ఫిట్‌నెస్ ఒక్కటే మార్గం.. ఆ రోజు డిసైడ్ అయ్యాడు, ఈరోజు దాకా ఫిట్‌నెస్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు..
1217
పార్టీలు మానేశాడు, నాన్ వెజ్ తినడం ఆపేశాడు. తన చుట్టూ ఓ బరి గీసుకున్నాడు. కఠినమైన క్రమశిక్షణ అలవర్చుకున్నాడు. అప్పుడు అతనిలో 32 శాతం ఫ్యాట్ ఉండేది. రెండు మూడేళ్లలోనే టీమ్‌లోనే ఫిట్టెస్ట్ ప్లేయర్‌గా మారిపోయాడు...
1317
అక్కడితో ఆగితే విరాట్ కోహ్లీ, ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాడు కాదు. ప్రపంచంలో ఉన్న బెస్ట్ బ్యాటర్లందరినీ మ్యాప్ గీసి తన రూమ్‌లో పెట్టుకున్నాడు. వీళ్లందరినీ తాను దాటేయాలనుకుంటున్నట్టు చెప్పాడు..
1417
అలా వరల్డ్ నెం. 1 బ్యాటర్ కావాలంటే ఏం చేయాలో తనకి తానే ప్రిపరేషన్ మొదలెట్టాడు, ట్రైయినింగ్ మార్చుకున్నాడు. ఆ టైమ్‌లోనే టెస్టులపై ఫోకస్ పెట్టాలనుకున్నాడు. కొన్నేళ్లకే మూడు ఫార్మాట్లలో నెం.1 బ్యాటర్‌గా అయ్యాడు... విరాట్ కోహ్లీ ఓ అగ్నిపర్వతంలాంటోడు..
1517
రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు, ఒక్క రోజు, ఒక్క ఇన్నింగ్స్ ఆడిన తర్వాత అలిసిపోతారు. విరాట్ కోహ్లీ మాత్రం టెస్టు మ్యాచ్ మొదటి బంతి నుంచి ఐదో రోజు ఆఖరి బంతి వరకూ ఒకే రకమైన స్టామినా మెయింటైన్ చేస్తాడు...
1617
Virat Kohli
అంతేకాదు అతనిలో ఓ అపరిచితుడు ఉన్నాడు. ఎప్పుడు ఎలా ఉంటాడో చెప్పడం కష్టం. ఒక్కసారిగా కోపంగా కళ్లలో కళ్లు పెట్టి చూస్తాడు, అంతలోనే పక్కనొచ్చి కూర్చొని జోకులు వేస్తాడు.
1717
Image credit: PTI
కోహ్లీకి ఓ మంచి స్నేహితుడు కావాలి. లక్కీగా ఆయన భార్య అనుష్క.. అదే చేస్తోంది.. ’ అంటూ చెప్పుకొచ్చాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు ఎమ్మెస్కే ప్రసాద్...