రోహిత్ శర్మకు మంజ్రేకర్ సలహాలు
సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ రోహిత్ శర్మ నిర్ణయాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'ఇది ఖచ్చితంగా వింతగా ఉంది. ఇది రోహిత్ శర్మ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఎడమ, కుడి చేతుల కలయిక గురించి ఆలోచిస్తున్నారు. ఆటగాళ్ల మొత్తం నాణ్యత, సామర్థ్యం ఆధారంగా వారు ముందుకు సాగాలని నేను భావిస్తున్నాను. భారత్‌కు అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్ అవసరమైనప్పుడు.. రోహిత్ (2, 52, 0, 8) నాలుగు ఇన్నింగ్స్‌లలో 62 పరుగులు మాత్రమే చేయగా, కోహ్లీ (0, 70, 1, 17) 88 పరుగులు చేసిన విషయాలను గుర్తు చేశాడు.
భారత ఆటగాళ్లపై న్యూజిలాండ్ మాజీ లెజెండ్ విమర్శలు
న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ మాట్లాడుతూ.. ''భారత బ్యాట్స్‌మెన్‌లు స్పిన్‌లో మెరుగైన ఆటగాళ్ళు అన్నది అపోహ. వారు మెరుగైన స్పిన్నర్లను కలిగి ఉన్నారనీ, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ల బలహీనతలను బయటపెట్టగలరని నేను భావిస్తున్నాను, అయితే ఈ టెస్టు (పుణె)లో మిచెల్ సాంట్నర్ అద్భుతంగా రాణించి వారి బ్యాట్స్‌మెన్‌లకు షాక్ ఇచ్చాడు. న్యూజిలాండ్ స్పిన్ అటాక్ ప్రపంచ స్థాయి కాదు.. కానీ, భారత బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శన చేయడం ఆందోళన కలిగిస్తోందని'' అన్నాడు.