కోచ్‌లకు కూడా బ్రేక్స్ ఎందుకు..? నువ్వే టీమ్‌తో ఉండకుంటే ఎలా..? ద్రావిడ్‌పై మాజీ హెడ్ కోచ్ ఆగ్రహం

Published : Nov 17, 2022, 03:54 PM IST

గతంలో పలు సిరీస్ లకు విరామం తీసుకున్న ద్రావిడ్.. తాజాగా న్యూజిలాండ్ సిరీస్ లో కూడా విశ్రాంతి తీసుకున్నాడు. ఈ టూర్ కూ బీసీసీఐ లక్ష్మణ్ నే హెడ్ కోచ్ గా నియమించింది.  సాధారణంగా  ఆటగాళ్లకు విరామమివ్వడం అందరికీ తెలిసిందే గానీ  హెడ్ కోచ్ లకూ  విరామమివ్వడంపై.. 

PREV
16
కోచ్‌లకు కూడా బ్రేక్స్ ఎందుకు..? నువ్వే టీమ్‌తో ఉండకుంటే ఎలా..? ద్రావిడ్‌పై మాజీ  హెడ్ కోచ్  ఆగ్రహం

టీమిండియాలో ఆటగాళ్లతో పాటు  ఈ ఏడాది మునుపెన్నడూ లేనివిధంగా హెడ్ కోచ్   రాహుల్ ద్రావిడ్ కు కూడా విరామమిచ్చిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత భారత జట్టు వెస్టిండీస్ కు వెళ్లగా   ద్రావిడ్ ఆ టూర్ కు వెళ్లలేదు. జింబాబ్వే టూర్ ను కూడా మిస్ చేశాడు. 

26

ఈ రెండు టూర్లకు వీవీఎస్ లక్ష్మణ్  హెడ్ కోచ్ గా వ్యవహరించాడు. ఇక తాజాగా న్యూజిలాండ్ సిరీస్ లో కూడా ద్రావిడ్  విరామం తీసుకున్నాడు. ఈ టూర్ కూ బీసీసీఐ లక్ష్మణ్ నే హెడ్ కోచ్ గా నియమించింది.  సాధారణంగా  ఆటగాళ్లకు విరామమివ్వడం అందరికీ తెలిసిందే గానీ  హెడ్ కోచ్ లకూ  విరామమివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 

36

తాజాగా ఇదే విషయమై  టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. అసలు కోచ్ లు విరామం తీసుకోవాల్సిన అవసరమేముందని  ప్రశ్నించాడు. ఐపీఎల్ ఆడేప్పుడు మూడు నెలల పాటు ఎలాగూ  టీమిండియా హెడ్ కోచ్  విశ్రాంతి తీసుకుంటాడు కదా..? మళ్లీ  ప్రతీ రెండు సిరీస్ లకు విరామమివ్వడం దేనికి..? అని  ఆగ్రహం  వ్యక్తం చేశాడు. 

46

రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘అసలు హెడ్ కోచ్ బ్రేక్ ఎందుకు తీసుకుంటున్నాడనేది నా ఊహకు అందడం లేదు. అసలు ఇన్ని బ్రేక్ లు తీసుకుని  చేసేదేముంది..?  నేనైతే బ్రేక్ లు తీసుకోలేదు. నేను ఎల్లప్పుడూ నా జట్టును అర్థం చేసుకునేందుకు ట్రై చేస్తా. ఐపీఎల్ ద్వారా మీకు (హెడ్ కోచ్) మూడు నెలల పాటు విరామం  దొరుకుతుంది కదా.. మిగిలిన టైమ్ లో కూడా  మళ్లీ బ్రేక్ తీసుకోవడం దేనికి..?

56

ఈ విషయంలో నేను ఎవరినీ వేలెత్తి చూపడం లేదు.  కానీ జట్టు గురించి ఆలోచించండి. వచ్చే రెండేళ్లలో ప్రపంచకప్  ఉంది. ఆ జట్టును సన్నద్ధం చేయడానికి నిత్యం ఆటగాళ్లతో గడపాలి.  జట్టులో ఎవరి సామర్థ్యమెంత..?   ఎవరికి ఏ రోల్ ఇవ్వాలి..? మ్యాచ్ విన్నర్లు ఎవరు..? వంటివి గుర్తించాలి. ఆ విధంగా వారిని ప్రోత్సహించాలి.  

66

మనకు  వనరుల (ఆటగాళ్లు)  పరంగా లోటేమీ లేదు.   ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని ఇప్పట్నుంచే జట్టును సిద్ధం చేసుకోవాలి. అది న్యూజిలాండ్ సిరీస్ తోనే మొదలుపెడితే బాగుండేది. ఈ టూర్ లో ఎంపిక చేసిన జట్టును  చూడండి. చాలా మంది కొత్త కుర్రాళ్లు ఉన్నారు. వారిని  మెరుగైన ఆటగాళ్లుగా తయారుచేయాలి.  ఈ  రెండేండ్లలో వారిని తీర్చిదిద్దాలి. ఆ దిశగా కోచింగ్ సిబ్బంది పనిచేయాలి..’అని తెలిపాడు. 

click me!

Recommended Stories